Breaking News

మహిళా రైతును కాపాడిన దిశ యాప్‌

Published on Fri, 08/18/2023 - 16:04

సాక్షి, నంద్యాల జిల్లా: దిశ యాప్‌తో తనకేమి ఉపయోగం ఉంటుందనుకున్న ఓ మహిళా రైతుకు అదే యాప్ రక్షణగా నిలబడింది. పొలం పనులు ముగించుకొని ఇంటికెళ్తున్న ఆమెపై ఓ వ్యక్తి అఘాయిత్యానికి యత్నించగా, వెంటనే ఆ మహిళ దిశ SOS కు కాల్ చేసి సహాయం కోరింది. నిముషాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన నంద్యాల జిల్లా రుద్రవరం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 

రుద్రవరం మండలం పెద్ద కంబలూరుకు చెందిన మహిళ పొలం పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రసాద్ అనే వ్యక్తి అఘాయిత్యానికి ప్రయత్నించాడు. మహిళ గట్టిగా కేకలు వేసి ప్రసాద్ నుంచి తప్పించుకుంది. స్థానికులు రావడంతో ప్రసాద్ అక్కడ నుండి పారిపోయాడు. బాధిత మహిళ దిశ SOS కు కాల్ చేసి జరిగిన సంఘటనను వివరించింది.
చదవండి: పవన్‌పై క్రిమినల్‌ డిఫమేషన్‌ కేసు.. వలంటీర్‌ స్టేట్‌మెంట్‌ రికార్డ్‌

బాధిత మహిళ వుండే లోకేషన్‌కు దిశ పోలీసులు కేవలం పది నిముషాల వ్యవధిలో చేరుకున్నారు. సిరివెళ్ల వైపు పారిపోతున్న నిందితుడు ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రసాద్ పై ఐపీసీ సెక్షన్ 354 ఏ, 354 బి, 506ల కింద రుద్రవరం పోలీసులు కేసు నమోదు చేశారు.

దిశ SOS కు కాల్ చేసిన పది నిముషాల వ్యవధిలో పోలీసులు వచ్చి సహాయం చేశారని బాధిత మహిళ సంతోషం వ్యక్తం చేసింది. రెండు నెలల క్రితం తన సెల్ ఫోన్‌లో గ్రామ సచివాలయ సిబ్బంది దిశ యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసి, ఎలా ఉపయోగించాలో వివరించినట్లు మహిళ తెలిపింది. ఆ సమయంలో దిశ యాప్ వలన తనకేమి ఉపయోగం ఉంటుందని సచివాలయ సిబ్బందితో వాదించిన విషయాన్ని మహిళ గుర్తు చేసింది.

కానీ అదే దిశ యాప్ ఈ రోజు తనకు రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని ఊహించలేదని పేర్కొంది. ఆపదలో ఉన్న తనకు దిశ పోలీసులు చేసిన సహాయం ఎప్పటికీ మరువలేనని చెప్పింది. మహిళల రక్షణ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా పనిచేస్తున్నట్లు దిశ పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అమ్మాయిలు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)