Breaking News

డీఎస్పీల బదిలీల్లోనూ వివక్ష

Published on Fri, 08/02/2024 - 05:25

సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం పోలీసు అధికారులపై కక్షసాధింపు చర్యల్లోనూ వికృత పోకడలకు బరితెగిస్తోంది. రెడ్‌బుక్‌ రాజ్యాంగం పేరిట కక్షసాధింపు చర్యల్లో భాగంగా కొన్ని సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకుంది. రాష్ట్రంలో డీఎస్పీల బదిలీ ప్రక్రియ ఇందుకు తాజా ఉదాహరణ. టీడీపీ కూటమి ప్రభుత్వం భారీస్థాయిలో 96 మంది డీఎస్పీలను గురువారం బదిలీ చేసింది. వారిలో బదిలీ చేసిన 96 మంది జాబితాలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన డీఎస్పీలు 15 మంది ఉన్నారు. 

ఆ 15 మందిలో కనీసం ఒక్కరంటే ఒక్కరికి కూడా ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వకపోవడం విభ్రాంతి కలిగిస్తోంది. జి.నాగేశ్వర్‌రెడ్డి (కాశీబుగ్గ), కె.శ్రీనివాసరెడ్డి (తూర్పు గోదావరి క్రైం), వి.నారాయణస్వామిరెడ్డి ( భీమవరం), పి.మురళీకృష్ణారెడ్డి( విజయవాడ వెస్ట్‌ ఏసీపీ), పి.వీరాంజనేయరెడ్డి (నెల్లూరు రూరల్‌), ఎం.సూర్యనారాయణరెడ్డి (గూడూరు), వి.శ్రీనివాసరెడ్డి (నాయుడుపేట), బి.ఉమామహేశ్వరరెడ్డి (శ్రీకాళహస్తి), వై.శ్రీనివాసరెడ్డి (డోన్‌), జి.ప్రభాకర్‌రెడ్డి (మదనపల్లి), జి.శివభాస్కర్‌రెడ్డి (గుంతకల్లు), ఎన్‌.రవీంద్రనాథ్‌రెడ్డి (నంద్యాల), పి.రవీంద్రనాథ్‌రెడ్డి (ఇంటెలిజెన్స్‌), వి.వేణుగోపాల్‌రెడ్డి, (ఇంటెలిజెన్స్‌), జి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి (ఇంటెలిజెన్స్‌)లను బదిలీ చేస్తూ వారికి ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. 

అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారులను ఉద్దేశపూర్వకంగా వేధించాలన్నది టీడీపీ విధానంగా చేసుకుందన్నది స్పష్టమవుతోంది. ఇంకా అనంతపురం రూరల్‌ డీఎస్పీ శివారెడ్డి, నెల్లూరు టౌన్‌ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, ఆత్మకూరు డీఎస్పీ కోటా రెడ్డి ఉన్నారు. వారిని కూడా బదిలీ చేస్తున్నట్టు ఇప్పటికే మౌఖికంగా చెప్పేశారని సమాచారం. అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 300 మందికి పైగా డీఎస్పీలను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారిలో మొదటి విడతలో 96 మందిని బదిలీ చేసింది. మరో రెండు విడతల్లో మిగిలిన వారిని బదిలీ చేయనుంది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)