Breaking News

కట్టుదిట్టంగా టెన్త్‌ పరీక్షలు

Published on Wed, 04/05/2023 - 05:01

సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్షల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ దేవానందరెడ్డి మంగళవారం అధికారులకు  పలు సూచనలు జారీచేశారు. పరీక్ష కేంద్రాల్లో అక్రమాలు, అవకతవకలు జరిగితే చీఫ్‌ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్, సి–సెంటర్‌ కస్టోడియన్‌లు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. 

♦ పరీక్ష కేంద్రాలన్నీ నో మొబైల్‌ జోన్లుగా ప్రకటించిన నేపథ్యంలో పరీక్ష విధుల్లో పాల్గొనే సిబ్బంది తమ మొబైల్‌ ఫోన్‌ ఇంట్లోనే ఉంచి రావాలి. లేదా సెంటర్‌లో పోలీస్‌ పికెట్‌ వద్ద అప్పగించాలి. 
♦ఒకసారి పరీక్ష కేంద్రంలోకి వచ్చిన సిబ్బంది పరీక్ష ముగిసేవరకు బయటికి రాకూడదు. అటెండర్లు, ఇతర సహాయకులు కూడా టీ, శీతల పానీయాలు వంటి అవసరాలకు కూడా బయటకు రాకూడదు.
♦పరీక్ష విధులు లేని ఉపాధ్యాయులు పరీక్ష జరిగే సమయంలో ఆ పరిసరాల్లో ఉండకూడదు.
♦  పరీక్ష కేంద్రాలుగా ఉన్న కె.జి.బి.వి., రెసిడెన్షియల్‌ పాఠశాలల ఉపాధ్యాయులు పరీక్ష విధులు లేకపోతే ఆ సమయంలో పాఠశాలలో ఉండకూడదు. 
♦   పరీక్ష కేంద్రంలో ప్రైవేట్‌ వ్యక్తులు ఎవరు ఉండకూడదు.
♦ ప్రశ్నపత్రాలు, వాటిపై వదంతులు వాట్సాప్‌ గ్రూప్‌లలోగానీ, సామాజిక మాధ్యమాల్లోగానీ ప్రచారం చేయకూడదు.
♦ చీఫ్‌ సూపరింటెండెంట్లు పరీక్షకు హాజరుకాని అభ్యర్థుల ప్రశ్నపత్రాలను, మిగిలిన ప్రశ్నపత్రాలను ఉదయం 10 గంటలలోపు అకౌంట్‌ రాసి సీల్‌ చేయాలి. 
♦  ఈ నిబంధనలు అతిక్రమించిన వారికి పరీక్షల చట్టం 25/97 ప్రకారం ఏడేళ్ల వరకు జైలుశిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తారు.  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)