Breaking News

అర్ధరాత్రి ఆర్డరిచ్చి లాగించేస్తున్నారు

Published on Fri, 01/03/2025 - 05:13

సాక్షి, అమరావతి: కాలం మారింది.. అభిరుచులు, అలవాట్లూ మారిపోతున్నాయి. అర్ధరాత్రి వేళ మనం గాఢ నిద్రలో ఉన్న సమయంలో చాలా విందులు జరిగిపోతున్నాయి. రాత్రి పెందరాళే పడుకోవాలన్న పెద్దల మాట ఇప్పుడు చెల్లుబాటు కావడంలేదు. అర్ధ రాత్రి 12 దాటిన తర్వాత మొదలు తెల్లారేవరకు దేశంలో చాలా ఫుడ్‌ డెలివరీ జరిగిపోతోంది. లక్షలాది మంది నిశిరాత్రిలో ఫుడ్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. 

ఇందులో చిప్స్, కూల్‌డ్రింక్స్‌దే అగ్రస్థానం. 2024 సంవత్సరానికి సంబంధించి ఈ కామర్స్‌ సంస్థలు విడుదల చేసిన డేటా ఈ విషయాన్ని వెల్లడించింది. అర్థరాత్రి 12  నుంచి తెల్లవారుఝామున 4 గంటల మధ్య ఫుడ్‌ ఆర్డర్లు అత్యధికంగా వస్తున్నట్లు ఈ కామర్స్‌ సంస్థలు బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ వంటి సంస్థల డేటా పరిశీలిస్తే తెలుస్తోంది. 

2024లో ఈ సమయంలో ఏకంగా రెండు కోట్లపైగా ఆర్డర్లు స్నాక్స్‌ కోసం వచ్చినట్లు ఈ కామర్స్‌ సంస్థలు వెల్లడించాయి. ఒక్క ముంబైలోనే ఈ సమయంలో 31.5 లక్షల ఆర్డర్లు డెలివరీ చేసినట్లు తెలిపాయి.  

నిరంతరం భారీ ఆర్డర్లు
పగలూ రాత్రీ నిరంతరం ఆన్‌లైన్‌లో భారీ ఆర్డర్లు వస్తున్నట్లు ఈ సంస్థలు చెబుతున్నాయి. చాలా మంది నిత్యావసర సరుకులూ ఆన్‌లైన్‌లో భారీగానే తెప్పించేస్తున్నారు. గోధుమ పిండి, ఆయిల్, దోశ పిండి, పాలు, పెరుగు, చిప్స్, కూల్‌డ్రింక్స్, పచ్చి మిరపకాయలు, టమోటాలు వంటివి ఆన్‌లైన్‌ ద్వారా కొంటూ లక్షల్లో బిల్లులు చేస్తున్నారు. ఢిల్లీ, డెహ్రాడూన్‌లలో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ ద్వారా కొందరు ఏడాదికి రూ. 20 లక్షలు విలువైన కొనుగోళ్లు చేశారంటే ఆర్డర్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 

చిప్స్, కూల్‌డ్రింక్స్‌దీ పెద్ద మార్కెట్టే. బ్లింకిట్‌ ఒక్కటే ఈ సంవత్సరం 1.75 కోట్ల మ్యాగీ ప్యాకెట్లను డెలివరీ చేస్తే, జెప్టో 12 లక్షల లేస్‌ మ్యాజిక్‌ మసాలా చిప్స్‌ సరఫరా చేసింది. అంతేకాదు.. బ్లింకిట్‌ 1.85 కోట్ల కోకోకోలా కాన్స్, 84 లక్షల బాటిల్స్‌ థమ్సప్, 14.6 లక్షల మజా బాటిల్స్‌ను డెలివరీ చేసింది. ఒక్క వ్యక్తే ఏకంగా 1,203  స్స్రైట్‌ బాటి­ల్స్‌ ఆర్డరు పెట్టాడు. 43 మంది ఒకొక్కరు రూ.75,000 విలువైన చిప్స్‌ ప్యాకెట్లను ఈ ఏడాదిలో కొన్నారు.

హైదరాబాద్, చెన్నై, కొచ్చి, కోల్‌కతా వంటి పట్టణాల్లో చిప్స్‌ ఆర్డర్లు అత్యధికంగా ఉంటున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఒకాయన ఫ్రూటీ కోసం ఒక్క ఏడాదిలో రూ.35,000 ఖర్చుచేస్తే, మరో వ్యక్తి గ్యాస్‌ సమస్య తగ్గించే ఈనో ప్యాకెట్లు 217 కొనేశాడు. వాలెంటైన్స్‌ డే రోజున ప్రతి నిమిషానికి 307 గులాబీ పువ్వులు ఈ సంస్థలు డెలివరీ చేశాయి. జెప్టో ఏడాది మొత్తం మీద 8.25 లక్షల గులాబీ పువ్వులను సరఫరా చేసింది.

ముంబైకి చెందిన జంతు ప్రేమికుడు ఒకాయన కుక్కలు, పిల్లుల ఆహారం కోసం రూ.15 లక్షలకు పైగా ఖర్చు చేశాడట.  చెన్నైకి చెందిన మరో జంతు ప్రేమికుడు జెప్టో నుంచి 5,234 క్వింటాళ్ల ఆహారం జంతువుల కోసం ఆర్డర్లు పెట్టారు.  

విజయవాడ వాళ్లకి పాలు, పెరుగుంటే చాలు
రాష్ట్రంలోని విజయవాడ విషయానికి వస్తే ఇన్‌స్టామార్ట్‌లో అత్యధికంగా పాలు, పెరుగు, టమోటా, పచ్చిమిర్చి, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ వంటి వాటిని అత్యధికంగా కొంటున్నారు. రోజువారీ ఆర్డర్లలో బ్రెడ్, కోడిగుడ్లు కూడా ఉంటున్నాయి. విజయవాడలో పది నిమిషాలకు ఒకసారి ఎల్రక్టానిక్‌ వస్తువులను కొంటున్నారు. పండుగల సమయంలో సుమారుగా రూ.1.5 లక్షల విలువైన ఎల్రక్టానిక్‌ వస్తువులను ఆన్‌లైన్‌ ద్వారా కొంటున్నట్లు ఈ సంస్థలు వెల్లడించాయి.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)