Breaking News

నత్తనడకన ఈ–కేవైసీ నమోదు

Published on Sat, 02/01/2025 - 05:43

సాక్షి, అమరావతి: రబీ సీజన్‌కి సంబంధించి ఈ–కేవైసీ( E-KYC)  నమోదు నత్తనడకన సాగుతోంది. నోటిఫై పంటలకు నూరు శాతం ఈ–కేవైసీ పూర్తి కాకపోతే పంటల బీమా పరిహారం పొందడంలో రైతులు తీవ్రంగా నష్టపోతారు. రబీ సీజన్‌లో సాగు లక్ష్యం 57.66 లక్షల ఎకరాలు కాగా ఇప్పటివరకు 14 లక్షల మంది రైతులు 38.63 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేశారు. ఇందులో 30 లక్షల ఎకరాల్లో (77 శాతం) సాగవుతున్న పంటలను మాత్రమే ఈ – పంటలో నమోదు చేశారు.

ఇక ఈ–కేవైసీ నమోదు మాత్రం అసలు ముందుకు సాగడం లేదు. వీఏఏలు 27.60 లక్షల ఎకరాలకు, వీఆర్వోలు, 23.95 లక్షల ఎకరాలకు సంబంధించి అథెంటికేషన్‌ పూర్తి చేయగా, కేవలం 4 లక్షల మంది రైతులు 10.88 లక్షల ఎకరాలకు (30 శాతం) మాత్రమే ఈ–కేవైసీ పూర్తి చేయగలిగారు. 

నోటిఫై పంటలకు ఈ–కేవైసీ తప్పనిసరి
ప్రస్తుత రబీ సీజన్‌ నుంచి ఈ క్రాప్‌ నమోదులో కొన్ని మార్పులు చేశారు. అన్ని పంటలకు 50 మీటర్ల పరిధిలో జియో రెఫరెన్స్‌ తప్పనిసరి చేసారు. నాన్‌ నోటిఫైడ్‌ పంటలు, సామాజిక అడవులకు సంబం«ధించి ఈ–కేవైసీని రైతులు ఇష్టపూర్వకంగా నమోదు చేసుకోవచ్చు. పంటల బీమా కోసం నోటిఫై చేసిన పంటలు సాగు చేసిన రైతులకు ఈ–కేవైసీ తప్పనిసరి చేశారు. 

తొలుత రైతులు సాగు చేసే పంట వివరాలను రైతు సేవాకేంద్రం (ఆర్‌ఎస్‌కే)లోని ఈ–పంట వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేసి క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత ఫొటోలను ఈ–పంట యాప్‌ ద్వారా అప్లోడ్ చేయాలి. బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ (ఈ–కేవైసీ) పూర్తయిన తరువాత భౌతికంగా రసీదులిస్తారు. కౌలుగుర్తింపు కార్డు లేక పోయినా వాస్తవంగా సాగుచేస్తున్న వారి పేరిటే నమోదు చేయాలని వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. 

వాస్తవానికి రబీ సీజన్‌లో నోటిఫై చేసిన వ్యవసాయ పంటల విస్తీర్ణం 45.55 లక్షల ఎకరాలు కాగా 9.93 లక్షల ఎకరాలకే రైతులు బీమా చేయించుకున్నారు. అయితే ఎవరు ఎక్కడ ఎంత విస్తీర్ణంలో బీమా చేయించుకున్నారో తెలియని పరిస్థితి. నోటిఫైడ్‌ పంటలకు సంబంధించి సాగుచేసిన ప్రతి ఎకరాకు ఈ–కేవైసీ నమోదు చేయాల్సిందే. లేకుంటే ఆ మేరకు పంటల బీమా పొందేందుకు ప్రీమియం చెల్లించిన రైతులు నష్టపోతారు.

ఫిబ్రవరి 25లోగా నూరు శాతం ఈ–కేవైసీ
నిర్ధేశించిన గడువులోగా ఈ–పంట నమోదు పూర్తవుతుందో లేదో అనే ఆందోళన నెలకొంది. నోటిఫైడ్‌ పంటలకు సంబంధించి నూరుశాతం ఈ–కేవైసీ నమోదు చేయాలన్న నిబంధనతో ఆర్‌ఎస్‌కే సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. గతంలో వలంటీర్ల సహకారంతో ఈ–పంట నమోదుతో పాటుగా ఈ–కేవైసీ కూడా వేగంగా పూర్తి చేసేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. 

విత్తనాలు, ఎరువుల పంపిణీతో పాటు వివిధ రకాల సర్వే బాధ్యతలు కూడా ఆర్‌ఎస్‌కే సిబ్బందికి అప్పగిస్తున్నారు. దీంతో ఈ–పంట, ఈ–కేవైసీ నమోదు సందర్భంగా వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఈ–పంట నమోదుతో పాటు ఈ–కేవైసీ నమోదుకు ఫిబ్రవరి 25వ తేదీ వరకు గడువిచ్చారు. మార్చి 1 నుంచి 5వ తేదీ వరకు ఆర్‌ఎస్‌కేల్లో జాబితా ప్రదర్శిస్తారు. 

10వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి మార్చి 15న తుది జాబితాలు రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శిస్తారు. మరోవైపు ఈ–పంట నమోదు కాకపోతే పంట నష్టపరిహారం, పంటల బీమా పరిహారాన్ని రైతులు కోల్పోతారు. చివరికి పంట అమ్ముకునే విషయంలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)