విజయనగరం జిల్లాలో డయేరియా డేంజర్‌ బెల్స్‌

Published on Fri, 10/18/2024 - 05:04

సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లా గుర్ల మండలంలో డయేరియా విజృంభిస్తోంది. మండల కేంద్రమైన గుర్లకు చెందిన బోడసింగి రాములమ్మ (67), కోట­గండ్రేడు గ్రామానికి చెందిన మరడాన అప్పలనర్స­య్యమ్మ (57) గురువారం డయేరియాతో మృతి చెందారు. దీంతో గత ఐదు రోజుల్లో డయేరియాతో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. రాములమ్మకు రెండ్రోజుల క్రితమే డయేరి­యా సో­కింది. ఆమెకు గుర్లలోని వైద్య శిబిరంలో చికిత్స అందించ­డంతో రోగం తగ్గిపోయిందని బుధవా­రం ఆమెను కుటుంబ­సభ్యులు ఇంటికి తీసుకువెళ్లిపోయారు. 

గురువారం ఉద­యం మళ్లీ వాంతులు, విరేచనాలు అవ్వడంతో ఆమె పరిస్థితి విషమించింది. ఆస్పత్రికి తీసు­కెళ్ల­డానికి కుటుంబ సభ్యులు సిద్ధమవుతుండగానే మృతి చెందింది. అప్పల­నర్సయ్యమ్మ­కు కూడా మూడు రోజుల క్రితమే డయేరియా సోకింది. ఆమెకు తొలుత గుర్ల పీహెచ్‌సీలో వైద్యం అందించారు. తర్వాత విజ­య­న­గరం జిల్లా సర్వ­జ­న ఆస్ప­త్రికి వైద్యులు రిఫర్‌ చేశారు. కానీ ఆమె పరిస్థితి విష­మంగా ఉండటంతో కేజీహెచ్‌కు అక్కడి వైద్యులు రిఫర్‌ చేశారు. 

కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. గుర్ల మండల కేంద్రంలో ఇప్పటికే 300 మంది ఈ రోగం బారి­నపడ్డారు. గురువారం కొత్తగా మరో 20 కేసులు నమోదయ్యాయి. గుర్లలోని జెడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ పద్మావతి సందర్శించారు.

 పాఠ­శాలలో బెంచీలపైనే 50 మంది రోగులను పడుకోబెట్టి వైద్యసేవలు అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని విజయ­నగరం జిల్లా సర్వజన ఆస్పత్రికి, విశాఖలోని కేజీహెచ్‌కు పంపిస్తున్నారు.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)