మరో ఆరుగురికి డయేరియా

Published on Sun, 10/27/2024 - 05:51

నరసరావుపేట: పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీలోని అంజనా­పురం కాలనీలో డయేరియా మరింత ప్రబలు­తోంది. కేసులు పెరుగుతున్నాయి. కాలనీలో శనివారం మరో ఆరుగురికి డయేరియా సోకింది. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇప్పటివరకు ఈ కాలనీలో వాంతులు, విరేచనాలతో ఇద్దరు మృతిచెందారు. 17 మంది ఆస్పత్రుల్లో చేరారు. వీరిలో కొంతమంది ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఇళ్లకు వెళ్లారు. శనివారం కూడా ఆరుగురికి డయేరియా సోకటం ఆందోళన కలిగిస్తోంది. 

కాలనీలో తమ్మిశెట్టి మాధవి, దేవళ్ల రాకేష్, తమ్మిశెట్టి అశోక్, తమ్మిశెట్టి శ్రీనివాసరావు, కొట్రా అన్నమ్మ, మరొకరు శనివారం వాంతులు, విరేచనాలతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరారు. కాలనీలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాల్లో ప్రాథమిక చికిత్స చేసిన తరువాత మెరుగైన వైద్యం కోసం సత్తెనపల్లి, నరసరావుపేట, గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలకు తరలిస్తున్నారు.

ప్రస్తుతం వాంతులు, విరేచనాలతో చికిత్స పొందుతున్న వారిలో కొట్రా అన్నమ్మ ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. తాగునీటి బోరులో నీరు కలుషితమవడంతో అంజనాపురం కాలనీ వాసులు ఈ నెల 22 నుంచి డయేరియా కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం స్పందించి వ్యాధి నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)