Breaking News

వజ్రాల్లేవ్‌...రావొద్దు!

Published on Mon, 11/10/2025 - 09:53

నంద్యాల జిల్లా: మహానంది, శిరివెళ్ల మండలాల సరిహద్దులోని గాజులపల్లె సమీపంలో ఉన్న వజ్రాలవంకలో వజ్రాన్వేషణ కోసం జనం పోటెత్తుతున్నారు. రాయలసీమ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీ ఎత్తున తరలివస్తున్నారు. వజ్రాలు దొరకకపోయినా వజ్రాలు దొరుకుతున్నాయి.. రూ. లక్షల విలువైనవంటూ సోషల్‌ మీడియాలో విపరీతంగా ప్రచారం చేయడంతో వచ్చే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. 

 వజ్రాలు దొరకడం దేవుడెరుగు...వజ్రాన్వేషణ మాటున అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందటంతో అప్రమత్తమయ్యారు. వజ్రాల కోసం అంటూ కొందరు అక్రమ కార్యకలాపాలకు పాల్ప డం గుర్తించినట్లు తెలిసింది. వంక వెంట కంపచెట్లు, పొదలు ఉండటం కొందరికి కలిసొస్తుంది. దీంతో పలు ప్రాంతాలకు చెందిన వారు పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. 

అలాగే కొన్ని ప్రేమ జంటలు సైతం అక్కడికి చేరుకుంటున్నట్లు సమాచారం. వజ్రాల వంక దగ్గర జరుగుతున్న వ్యవహారాలపై ఇంటలిజెన్స్‌ విభాగం, ఎస్‌బీ పోలీసుల ద్వారా అన్ని వివరాలు సేకరించిన జిల్లా పోలీసు ఉన్నతాధికారులు వజ్రాల వంక వద్దకు ఎవరిని రానివ్వొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు స్పెషల్‌ పార్టీ పోలీసులు ఆదివారం రంగంలోకి దిగి ఎలాంటి వజ్రాలు దొరకడం లేదని, రంగురాళ్లు, సూదిముక్కు రాళ్ల కోసం వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవద్దంటూ హితవు చెబుతూ అక్కడి నుంచి పంపించేస్తున్నారు.      

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)