బాలికపై మేనమామ అత్యాచారం

Published on Tue, 12/02/2025 - 05:22

ధర్మవరం అర్బన్‌: ఆ తల్లికి ఇద్దరు మగ పిల్లలు. దర్శనం కోసం బోయకొండ గంగమ్మ ఆలయానికి వెళ్లగా అక్కడ ఓ ఆడశిశువు ఏడుస్తూ కనిపించింది. ఎవరిని అడిగినా వారి బిడ్డ కాదన్నారు. దీంతో ఆమె అమ్మవారే తనకు బిడ్డను ఇచ్చారనుకుని ఇంటికి తెచ్చుకుని పెంచింది. ఇప్పుడా చిన్నారికి 14 ఏళ్లు. అయితే.. పెంచిన తల్లి తమ్ముడే ఆ పసిమొగ్గను తుంచేశాడు. కామంతో కళ్లుమూసుకుపోయి తరచూ బాలికపై అత్యాచారం జరిపాడు. చివరికి బాలిక గర్భం దాలి్చంది.  

వివాహమై ముగ్గురు పిల్లలున్నా.. 
ఆరో తరగతి వరకు చదివిన ఆ బాలిక ప్రస్తుతం ఇంట్లోనే ఉంటోంది. పెంచిన తండ్రి అనంతపురంలో ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. పెంపుడు తల్లి రెండో తమ్ముడు సాకే నరసింహ (వరుసకు మేనమామ) ఆ సమీపంలోని కాలనీలోనే నివసిస్తున్నాడు. అతనికి వివాహం కాగా.. ముగ్గురు పిల్లలున్నారు. అక్క కూలి పనులకు వెళ్లిన సమయంలో బాలికను తన ఇంటివద్ద చెత్త ఊడ్చేందుకు, ఇల్లు శుభ్రం చేసేందుకు తీసుకుని వెళ్లి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయట చెబితే చంపుతానని బెదిరించాడు. దీంతో బాలిక ఎవరికీ చెప్పలేదు.

రెండు రోజుల క్రితం కడుపు నొప్పితో బాధపడుతున్న బాలికను తల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు ఐదు నెలల గర్భవతి అని చెప్పారు. దీంతో ఆమె బోరున విలపించింది. బాలికను మందలించి విషయం ఆరా తీయగా.. మేనమామ సాకే నరసింహ దీనికి కారణమని చెప్పింది. దీంతో తల్లి వన్‌ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రితోపాటు బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి పంపించి వైద్యం చేయించారు. సాకే నరసింహను అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)