Breaking News

మైనింగ్‌ను వ్యతిరేకిస్తూ భక్తులు సాధుకొండ అధిరోహణ

Published on Sun, 08/02/2026 - 05:40

సాక్షి, మదనపల్లె: మల్లన్న కొలువైన అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె సమీపంలో ఉన్న మల్లయ్యకొండ సముదాయంలోని సాధుకొండను మైనింగ్‌ పేరుతో నాశనం చేయకుండా కాపాడాలని కోరుతూ భక్తులు, వృద్ధులు, మహిళలు కొండపైకెక్కి శివయ్యకు పూజలు చేశారు. భక్తుల శివనామ స్మరణతో సాధు కొండ మార్మోగింది. చంద్రబాబు ప్రభుత్వం ఈ ఆధ్యాత్మిక కొండను మైనింగ్‌కు ఇవ్వడంపై వృద్ధులు, మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్‌ ఆగాలని, వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం భక్తుల విశ్వాసాలు, మనోభావాలను పట్టించుకోకుండా సాధుకొండలో మైనింగ్‌కు ఏపీఎండీసీకి కాంపోజిట్‌ లైసెన్స్‌ కట్టబెట్టింది. దీన్ని నిరసిస్తూ భక్తులు ఇప్పటికే పలు రకాలుగా నిరసనలు తెలిపారు. 

కొండపై మైనింగ్‌ నిలిపివేయాలని కోరుతూ శనివారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌ రెడ్డి, మల్లికార్జున స్వామి అన్నదాన ట్రస్ట్‌ సభ్యుల ఆధ్వర్యంలో సమీపంలోని బోరెడ్డివారికోట నుంచి మహిళలు, యువకులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో 1,500 అడుగుల ఎత్తున్న సాధుకొండ ఎక్కారు. దారిలేని కొండపైకి బండరాళ్లు, చెట్ల మధ్య అనేక ఇబ్బందులు పడి పైకి చేరుకున్నారు. వారిలో వందమంది వరకు అక్కడే రాత్రి బస చేస్తున్నారు. వీరిలో పెద్దమండ్యం సింగిల్‌ విండో మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ నేత, 84 ఏళ్ల వయసున్న కడప సుధాహర రెడ్డి ఉన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు దేవరింటి రామకృష్ణారెడ్డి (పెదబాబు), దేవరింటి రవిశంకర్‌రెడ్డి కూడా అక్కడే బసచేశారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)