Breaking News

పర్యాటకంలో ‘పీపీపీ’

Published on Thu, 01/11/2024 - 05:32

సాక్షి, అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌లోని అపార పర్యాటక వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు  ఏపీ ప్రభుత్వం పీపీపీ విధానానికి పెద్దపీట వేస్తున్నది. ఇందులో భాగంగా పర్యాటక సామర్థ్యం ఉన్న ప్రాంతాలను ప్రత్యేకంగా సర్వే చేసింది. వీటిల్లో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా అంతర్జాతీయ స్థాయి పర్యాటక సేవలు అందించేందుకు కసరత్తు చేస్తోంది. తొలుత అడ్వెంచర్‌తో పాటు ఆహ్లాదాన్ని పంచే ప్రాంతాల్లో పర్యాటక అనుభూతుల కల్పనకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ప్రఖ్యాత హోటల్‌ రంగ సంస్థలు, కాంట్రాక్టర్ల నుంచి టెండర్లు ఆహ్వానిస్తున్నది.

‘అడ్వెంచర్‌’కు కేరాఫ్‌ గండికోట
వైఎస్సార్‌ జిల్లాలోని గండికోట ప్రాంతాన్ని ఎకో, అడ్వెంచర్‌ టూరిజానికి చిరునామాగా మార్చేందుకు ఏపీటీడీసీ ప్రణాళికలు రూపొందించింది. గ్రాండ్‌ కాన్యన్‌ ఆఫ్‌ ఇండియాగా పిలిచే గండికోటలో ఇప్పటికే అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ అకాడమీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఎర్రమల కొండలను చీలుస్తూ వేగంగా ప్రవహించే పెన్నానదిలో బోటింగ్‌ సౌకర్యాలను మెరుగుపర్చనుంది. వీటితో పాటు అంతర్జాతీయ హోటల్‌ రంగ సంస్థ  ఒబెరాయ్‌ త్వరలో ఏడు నక్షత్రాల హోటల్‌ నిర్మాణాన్ని ప్రారంభించనుంది. 

కృష్ణానదిపై ‘రోప్‌ వే’
విజయవాడలోని భవానీ ద్వీపం అభివృద్ధిలో భాగంగా రోప్‌వే ప్రాజెక్టును ప్రతిపాదించింది. విజయవాడలోని బెరంపార్కు నుంచి భవానీద్విపంలోకి కృష్ణా నదిపై 1.2 కిలోమీటర్ల ఏరియల్‌ పాసింజర్‌ రోప్‌వేను నిర్మించనుంది. దీంతో రాష్ట్రంలో ఆరుచోట్ల పాటు సీప్లేన్, మరో ఫైవ్‌స్టార్‌హోటల్‌ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానిస్తున్నది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో కన్వెక్షన్‌ సెంటర్‌తో కూడిన హోటల్‌ నిర్మాణం, తిరుపతి జిల్లాలోని తుపిలిపాలెం బీచ్‌లో హోటల్‌ సౌకర్యంతో కూడిన బీ­చ్‌ రిసార్టు, నంద్యాల జిల్లాలో వెల్‌నెస్‌ టూరిజం, వేసైడ్‌ ఎమినిటీస్‌ కల్పనకు టెండర్లు ఆహ్వానించింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)