అధికారికంగా క్రోధి ఉగాది వేడుకలు 

Published on Tue, 04/09/2024 - 04:36

సాక్షి, అమరావతి: క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను రాష్ట్ర ప్రభు­త్వం అధికారికంగా నిర్వహించనుంది. మంగళవారం తెలుగు సంప్రదాయాలను పాటిస్తూ పంచాంగ శ్రవణ కార్యక్రమంతో పాటు వేదపండితులు, ఆలయ అర్చకులను సత్కరించేందుకు  ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో విజయవాడలోని పింగళి వెంకయ్య సమా­వేశ మందిరంలో ఉదయం 9 గంటలకు కప్పగంతుల సుబ్బ­రామ సోమయాజులు ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహిస్తా­రు.

ఈ సందర్భంగా 18 మంది వేద పండితులను ఘనంగా సత్కరిస్తారు. అన్ని జిల్లాల్లో ఉగాది ఉత్సవాల నిర్వహణలో భాగంగా వేదపండితులు, అర్చకులకు సన్మాన కార్యక్రమాల నిర్వహణకు దేవదాయ శాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్దేశించారు. ప్రతి జిల్లాలో 62 ఏళ్లకు పైబడిన అర్చకులు ఇద్దరిని, ఒక వేద పండితుడిని సత్కరించాలని సూచించారు. సన్మాన గ్రహీతలకు ప్రశంసాపత్రం, రూ.10,116 సంభావన, శాలువా, కొత్తవస్త్రాలు, పండ్లు అందజేస్తారు.

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)