Breaking News

‘చిరు’ధాన్యాల సాగుకు పెద్ద ప్రోత్సాహం

Published on Sun, 04/23/2023 - 05:24

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిరుధాన్యాల సాగును ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ఈ ఆర్థిక ఏడాది(2023–24) 1,66,736 హెక్టార్లలో చిరుధాన్యాలు పండించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత ఆర్థి క ఏడాదితో పోల్చితే ఇది 39,365 హెక్టార్లు అధికం. అలాగే గత ఆర్థిక ఏడాది 3.22 లక్షల మెట్రిక్‌ టన్నుల చిరుధాన్యాలు ఉత్పత్తి చేయగా.. ఈసారి 4.11 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తి అవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది.

ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మిల్లెట్స్‌ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో సాగు విస్తీర్ణం, వినియోగాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడంతో పాటు ప్రజలు ఆహారంగా తీసుకునేలా అవగాహన కల్పించాలని జిల్లా కలె­క్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్‌.జవహర్‌రెడ్డి ఆదేశాలిచ్చారు. జిల్లాల వారీగా చిరుధాన్యాల సాగు విస్తీర్ణం లక్ష్యాలను నిర్ధారించారు. అందుకు అనుగుణంగా రైతులు సాగు చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఉత్పత్తులకు తగిన మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలని సీఎస్‌ ఆదేశించారు. 

వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకం కింద.. 
వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకం కింద రాష్ట్రంలో 160 చిరుధాన్యాల ప్రైమరీ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలని సీఎస్‌ సూచించారు. ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పే వారికి తగిన విధంగా ప్రోత్సాహకాలను అందించాలన్నారు. జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో చిరుధాన్యాల స్టాల్స్‌ ఏర్పాటు చేసి ఆయా ఉత్పత్తులను ప్రోత్సహించాలని ఆదేశించారు. మహిళా మార్టు­ల్లోనూ వీటిని విక్రయించాలని సూచించారు. చిరుధాన్యాలను ఆర్బీకేల ద్వారా కనీస మద్దతు ధరకు పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కనీస మద్దతు ధరను కూడా ప్రభుత్వం ప్రకటించింది.

అనేక జబ్బులకు చిరుధాన్యాలతో చెక్‌ 
జొన్నలు, సజ్జలు, రాగులు తదితరాల్లో పిండి పదార్థాలు ఎక్కువ. ఇవి దైనందిన అవసరాలకు సరిపడా 70 నుంచి 80 శాతం శక్తిని అందిస్తాయి. నిత్యం వీటిని ఆహారంగా వినియోగిస్తే గుండె జబ్బులు, షుగర్, బీపీ తదితర జబ్బులు అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబు­తు­న్నా­రు. రాగుల్లో ఖనిజాలు ముఖ్యంగా కాల్షియం అధికంగా ఉండటంతో.. మూత్ర రోగాలను అరికట్టడంతో పాటు దేహపుష్టిని కలుగజేస్తాయి. ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం మనం తీసుకునే ఆహారంలో చిరుధాన్యాలను వినియోగించాల్సిన అవసరముందని నిపుణులు చెబుతున్నారు.

Videos

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)