Breaking News

కొనసాగుతున్న భగభగలు

Published on Mon, 06/08/2026 - 03:42

సాక్షి, అమరావతి: నైరుతి రుతు పవనాలు ప్రవేశించినా రాష్ట్రంలో ఎండల తీవ్రత  తగ్గడంలేదు. ఆదివారం కోస్తా ప్రాంత ప్రజలను భానుడి భగభగతో పాటు ఉక్కపోత  ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రకాశం జిల్లా కరేడులో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 43.4, బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం, కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 43.2, పల్నాడుజిల్లా పిడుగురాళ్లలో 43.1, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రాపురం, ఎన్టీఆర్‌ జిల్లా తొర్రగుడిపాడులో 42.7, తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణగూడెం, ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరం, గుంటూరు జిల్లా పాండ్రపాడు, నెల్లూరు జిల్లా గూడూరులో 42.6, పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 42.5 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

పలు జిల్లాల్లో వర్షాలు 
మరోవైపు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం, నాతవరం, ప్రకాశం జిల్లా అద్దంకి, జరుగుమిల్లి, నెల్లూరు జిల్లా వింజమూరు తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. కర్ణాటక పరిసర ప్రాంతాల నుంచి కోస్తాంధ్ర వరకు విస్తరించి ఉన్న ద్రో­ణి ప్రభావంతో వచ్చే రెండు రోజులు కూడా అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.  

ఈ జిల్లాల్లో కొనసాగనున్న ఎండ తీవ్రత 
మరోవైపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే  అవకాశం ఉందని పేర్కొంది.  

విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు నెమ్మదిగా విస్తరిస్తున్నాయి. రాబోయే రెండు రోజుల్లో ఏపీలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. 

Videos

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు