Breaking News

ఇండియా పోస్ట్‌.. డిజిటల్‌ ఫీస్ట్‌

Published on Mon, 09/29/2025 - 05:54

సాక్షి, అమరావతి: వేగంగా.. సురక్షితంగా తపాలా సేవలు అందించేందుకు భారత తపాలా శాఖ (ఇండియా పోస్ట్‌) నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విని­యోగించుకోనుంది. వినియోగదారులకు మెరు­గైన సేవ­లదించే నిమిత్తం డిజిటల్‌ సేవలను అందు­బాటు­లోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఉన్న రిజి­స్టర్‌ పోస్టును ఇక నుంచి స్పీడ్‌ పోస్టులోకి విలీనం చే­సింది. పోస్టు పంపించిన వ్యక్తి సురక్షితంగా చేరిందని తెలుసుకోవడానికి రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే.. అద­నంగా రూ.5 రుసుమును వసూలు చేస్తుంది. అ­దే­వి­ధంగా వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) ఆధారిత డెలివరీ వి­ధానాన్ని కూడా స్పీడ్‌ పోస్టు అందుబాటులోకి తీ­సు­కొచ్చింది.

డెలివరీ బాయ్‌కు ఓటీపీ చెప్పిన త­ర్వాతనే బట్వాడా చేయనుంది. ఓటీపీ ఆధారిత డెలివరీకి కూడా రూ.5 అదనపు రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా స్పీడ్‌ పోస్టు చార్జీలను కూడా సవరించింది. సవరించిన ధరలు, కొత్త ఫీచర్లు అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్నట్టు ఇండియా పోస్ట్‌ ఏపీ సర్కిల్‌ చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ బీపీ శ్రీదేవి ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఇన్‌లాండ్‌ స్పీడ్‌ పోస్ట్‌ ధరలను చివరిసారిగా 2012లో సవరించడం జరిగిందని, నూతన టెక్నాలజీ , కొత్త ఆవిష్కరణల్లో పెట్టుబడుల కోసం ధరలను సవరించినట్టు పేర్కొన్నారు.

చార్జీలు ఇలా..
స్థానికంగా 50 గ్రాములలోపు డెలివరీ చేయడానికి తపాలా శాఖ రూ.19 చార్జీ వసూలు చేయనుంది. అదే 2,000 కి.మీ. వరకు రూ.47 వసూలు చేయనుంది. 51 నుంచి 250 గ్రాముల వరకు స్థానికంగా అయితే రూ.24 చొప్పున.. 2,000 కి.మీ. వరకు అయితే రూ.77గా చార్జీ నిర్ణయించారు. ఆపైన బరువుకు దూరాన్ని బట్టి ధరలను రూ.28 నుంచి రూ.93 వరకు చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్, ఓటీపీ సేవల ధరలపై అదనంగా జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. వీటితో పాటు ఆన్‌లైన్‌ పేమెంట్, ఎస్‌ఎంఎస్‌ ఆధారిత డెలివరీ, రియల్‌టైమ్‌ డెలివరీ అప్‌డేట్స్, ఆన్‌లైన్‌ బుకింగ్‌ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యా­ర్థులకు స్పీడ్‌పోస్టులో 10 శాతం, బల్క్‌ బుకింగ్స్‌కు 5 శాతం డిస్కౌంట్‌ ఇవ్వ­నున్నట్టు శ్రీదేవి వెల్లడించారు.

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)