Breaking News

వంద రోజుల్లో దళితులపై వంద దాడులు

Published on Tue, 10/01/2024 - 04:14

మదనపల్లె: టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం దళిత వ్యతిరేక పాలన చేస్తోందని బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. వంద రోజుల కూటమి పాలనలో దళితులపై వంద దాడులు జరిగినా.. దళితుల ఆత్మగౌరవానికి భంగం కలిగినా ఏమీపట్టనట్టు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తింది. ‘వంద రోజుల టీడీపీ కూటమి ప్రభుత్వం.. దళితులపై 100 దాడుల ప్రభుత్వం’ పేరిట బీఎస్పీ ఆధ్వర్యంలో సోమవారం అన్నమయ్య జిల్లా సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది.  టీడీపీ కూటమి ప్రభుత్వం, దళిత వ్యతిరేక ప్రభుత్వమని నినాదాలు చేస్తూ దళితులు నిరసన తెలిపారు. ఉండి ఎమ్మెల్యే కె.రఘురామకృష్ణరాజు, కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ దిష్టిబొమ్మలను దహనం చేశారు.

ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్‌కుమార్‌ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో నాలుగేళ్ల కాలంలో జరిగిన దాడులు, టీడీపీ పాలనలో కేవలం నాలుగు నెలల్లోనే జరిగాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితుల ఆత్మగౌరవానికి భంగం కలుగుతోందన్నారు. బీఆర్‌ అంబేడ్కర్‌ ఫ్లెక్సీని తొలగించిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును బర్తరఫ్‌ చేయాలని, దళిత వైద్యుడు ఉమామహేశ్వరరావుపై దాడిచేసి దూషణకు పాల్పడిన కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీని తక్షణమే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. వంద రోజుల కూటమి పాలనను గమనిస్తే.. దళితులనే లక్ష్యంగా పెట్టుకుని దాడులకు పాల్పడుతున్నట్టు తెలుస్తోందన్నారు. కూటమి ప్రభుత్వంపై దళితులంతా ఆగ్రహంతో ఉన్నారని, ఇదే పంథాలో పాలన కొనసాగిస్తే టీడీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉంటామన్నారు. 

బీఎస్పీ నేతలపై కేసులు నమోదు
సబ్‌ కలెక్టరేట్‌ ఎదుట టీడీపీ, జనసేన ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సబ్‌ కలెక్టరేట్‌కు చేరుకుని బీఎస్పీ నాయకులు, కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్‌కుమార్‌తో పాటు మరో ఐదుగురిని బలవంతంగా పోలీసు జీపులోకి ఎక్కించి, వన్‌టౌన్‌ స్టేషన్‌కు తరలించారు. రోడ్డుపై ధర్నా నిర్వహించినందుకు ఐపీసీ సెక్షన్‌ 188, సెక్షన్‌ 290, పబ్లిక్‌ న్యూసెన్స్‌ సెక్షన్‌ 341, సెక్షన్‌ 34 కింద కేసులు నమోదు చేశారు. బీఎస్పీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించిన ప్రభుత్వ చర్యల్ని బీఎస్పీ స్టేట్‌ కోఆర్డినేటర్, మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు, రాష్ట్ర అధ్యక్షులు బి.పరంజ్యోతి ఖండించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)