Breaking News

ల్యాప్‌టాప్‌ అనుకుంటే బండరాయి వచ్చింది!

Published on Thu, 06/06/2024 - 07:18

అనంతపురం ఎడ్యుకేషన్‌: కొరియర్‌లో ల్యాప్‌టాప్‌ వచ్చిందనుకుంటే బండరాయి కనిపించిన సంఘటన నగరంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయం నుంచి అన్ని జిల్లాల సమగ్ర శిక్ష డీపీసీ, ఏపీసీలకు హెచ్‌పీ కంపెనీ 12 జనరేషన్, 16 జీబీ ర్యామ్, 1టీబీ ఎస్‌ఎస్‌డీ, స్క్రీన్‌ విండోస్‌ 11 ప్రో, ఎంఎస్‌ ఆఫీస్‌ అడాప్టర్‌ క్యారీ కేస్‌ సామర్థ్యం కల్గిన ల్యాప్‌టాప్స్‌ కొనుగోలు చేశారు. 

హైదరాబాద్‌కు చెందిన కంప్యూటర్‌ ఇండియా అనే సంస్థ ఈ ల్యాప్‌టాప్స్‌ను     సరఫరా చేసింది. మే 31న జిల్లాకు వచ్చాయి. డీపీసీగా ఉన్న డీఈఓ తనకు అందిన ప్యాకింగ్‌ ఓపెన్‌ చేయగా, ల్యాప్‌టాప్‌ ఉంది. ఈ క్రమంలోనే జిల్లాకు పంపిన రెండు ల్యాప్‌టాప్‌ల్లో ఒకదానిని అందుకున్నట్లు సమాచారం పంపారని, రెండో దాని వివరాలు పంపాలంటూ బుధవారం సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చింది. దీంతో సమగ్ర శిక్ష ఏపీసీకి వచ్చిన పార్శిల్‌ను ఓపెన్‌ చేయగా.. అందులో బండరాయి దర్శనం   ఇచ్చింది. 

ఆ రాయికే కవర్లు కప్పి ఉంది.       అందులోనూ దాదాపు ల్యాప్‌టాప్‌ బరువు      ఏ మేర ఉంటుందో అంతేస్థాయి బరువున్న రాయి   ఉంచారు. అయితే, ఈ విషయాన్ని  వెంటనే రాష్ట్ర కార్యాలయ అధికారుల దృష్టికి స్థానిక సిబ్బంది తీసుకెళ్లారు. ల్యాప్‌టాప్‌ పార్శిల్‌ కవరుపై ఉన్న కంప్యూటర్‌ ఇండియా సంస్థ ఫోన్‌ నంబరుకు కాల్‌ చేసి ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)