Breaking News

ఆన్‌లైన్‌ ద్వారా డిగ్రీ అడ్మిషన్లు

Published on Mon, 07/01/2024 - 05:26

ప్రవేశాలకు నేడు నోటిఫికేషన్‌

మొత్తం సీట్లు దాదాపు 3.20 లక్షలు 

గత ఏడాది జూన్‌ 19నే ప్రక్రియ ప్రారంభం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి ఉన్నత విద్యా మండలి సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు అన్‌ ఎయిడెడ్, అటానమస్‌ డిగ్రీ కళాశాలల్లో సాధారణ డిగ్రీ కోర్సుల్లో ఆన్‌లైన్‌ ద్వారా సీట్లను భర్తీ చేయనుంది. వాస్తవానికి ఇంటరీ్మడియట్‌ ఫలితాలు విడుదలై రెండు నెలలు దాటినప్పటికీ డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభం కాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. తాజాగా..  ఇంటరీ్మడియెట్‌ సప్లిమెంటరీ ఫలితాలు కూడా ప్రకటించారు. వర్సిటీల నుంచి కళాశాలలకు అనుమతుల పొడిగింపు ప్రక్రియలో జాప్యంతోపాటు కొత్తగా బీసీఏ, బీబీఏ, బీఎంఎస్‌ కోర్సులు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) పరిధిలోకి వెళ్లాయి. ఫలితంగా యూజీసీ నుంచి రావాల్సిన గుర్తింపు ఏఐసీటీఈ ఇవ్వాల్సి వస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో సుమారు వెయ్యికి పైగా డిగ్రీ కళాశాలలు ఉండగా అందులో 800 వరకు బీసీఏ, బీబీఏ, బీఎంఎస్‌ కోర్సులు అందిస్తున్న కళాశాలలు వున్నాయి. వీటికి ఏఐసీటీఈ అనుమతులు వచ్చి, రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఎన్‌ఓసీ ఇచి్చన తర్వాతే సీట్ల భర్తీ చేయాల్సి రావడంతో అడ్మిషన్లకు జాప్యం జరిగింది. వీటికి తోడు.. 43 కళాశాలలు కొత్తగా అనుమతులు కోసం దరఖాస్తు చేశాయి. వీటిలో కేవలం రెండు లేదా మూడింటికి మాత్రమే అనుమతులొచ్చే అవకాశముందని ఉన్నత విద్య వర్గాలు చెబుతున్నాయి. ఈ కళాశాలల్లో 2024–25లోనే అడ్మిషన్లకు అవకాశం కలి్పంచనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. గతేడాది జూన్‌ 19 నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కాగా.. ప్రస్తుత ప్రభుత్వంలో ఆలస్యంగా జరుగుతుండటం గమనార్హం. మొత్తం సాధారణ డిగ్రీలో సుమారు 3.20 లక్షల వరకు సీట్లున్నాయి.

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)