Breaking News

కూతురు సునీతే అంతా చేశారు

Published on Sat, 11/29/2025 - 05:02

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని ఆయన కూతురు నర్రెడ్డి సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి మానసికంగా, ఆర్థికంగా తీవ్ర వేధింపులకు గురిచేశారని సీబీఐ కోర్టుకు న్యాయవాది ఉమామహేశ్వర్‌రావు విన్నవించారు. ఆయనకు కనీసం తిండి పెట్టేవారు లేకుండా చేశారంటూ వివేకా రెండో భార్య షమీమ్‌ ఇచ్చిన వాంగ్మూలాన్ని చదివి వినిపించారు. ‘బావమరిది, భార్య కూడా ఆయనను చేరదీయలేదు.  కుమారుడి గురించి ఆందోళన చెందారు. 

ఆయన చెక్‌పవర్‌ తొలగించి, ఆర్థిక దిగ్బంధం చేశారు. కుమారుడి పేరిట కొంత ఆస్తి ఇవ్వాలని భావించినా కూతురు, అల్లుడు, బావమరిది అడ్డుకున్నారు’ అంటూ ఆమె వాంగ్మూలంలో పేర్కొన్న అంశాలను ప్రస్తావించారు. కొంత డబ్బును ఆమెకు ఇవ్వాలనుకున్న క్రమంలో హత్యకు గురయ్యారని పేర్కొన్నారు. ఇంత స్పష్టంగా వాంగ్మూలం ఇచ్చినా సీబీఐ అధికారులు ఆ దిశగా దర్యాప్తు చేయకపోవడం ఆశ్చర్యకరమని నివేదించారు. హత్యకు ముందు వివేకా రాసిన లేఖను కూడా అల్లుడు మాయ చేసేందుకు యత్నించారన్నారు. 

హంతకుడు షేక్‌ దస్తగిరికి అనుకూలంగా వ్యవహరిస్తుండటం తీవ్ర అనుమానాస్పదమని వివరించారు. వైఎస్‌ వివేకా హత్య కేసులో మరింత లోతైన దర్యాప్తు చేపట్టేలా కేంద్ర దర్యాప్తు సంస్థను ఆదేశించాలని కోరుతూ సీబీఐకోర్టులో సునీత పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి డాక్టర్‌ టి.రాఘురామ్‌ శుక్రవారం మరోసారి విచారణ జరిపారు. 

ఈ సందర్భంగా శివశంకర్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, పార్లమెంట్‌ సభ్యుడు వైఎస్‌ అవినాశ్‌రెడ్డి తరఫు న్యాయవాది ఉమామహేశ్వర్‌రావు కోర్టుకు వాదనలు వినిపించారు. అనంతరం తదుపరి వాదనల నిమిత్తం పిటిషన్‌ను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ప్రతివాదుల తరఫు వాదనల్లో ముఖ్యాంశాలు...

ఇతరులను ఇరికించడమే ఉద్దేశం..
‘కూతురు, అల్లుడితో తీవ్ర ఆర్థిక, కుటుంబ విభేదా­లున్న అంశాన్ని కూడా ఈ కోర్టు పరిగణనలోకి తీసుకో­వాలి. అనుమానం వారిపైకి రాకుండా ఉండేందుకు ఇతరులపై మళ్లించే ప్రయత్నం జరుగుతోంది. అవినాశ్‌­రెడ్డి ఓ పార్టీ ఎంపీ కావడంతో ఆయనను నేరుగా ఎదుర్కోలేక అక్రమ మార్గంలో ఎదుర్కొ­నడానికి మరో వర్గం సునీతను ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగానే పిటిషన్లపై పిటిషన్లు దాఖలవుతున్నాయి. రాజకీయంగా కొందరిని ఇరికించాలన్నదే ప్రధాన ఉద్దేశ్యం. 

సునీత అంతా తాను అనుకున్నట్లే జరగాలని భావిస్తున్నారు. ఈ తీరు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. చార్జ్‌షీ­ట్‌ దాఖలయిన  చాలా కాలం తర్వాత.. రోజువారీ విచా­రణ చేసి ఆరు నెలల్లో పూర్తి చేసేలా సీబీఐ కోర్టును ఆదేశించాలంటూ సునీత హైకోర్టులో (సీఆర్‌ఎల్‌పీ 1270/2025) దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ ఇంకా పెండింగ్‌లో ఉంది. 

ఇప్పుడు ఇంకా దర్యాప్తు కోరుతూ పిటిషన్‌ వేశారు. ఒక్కో కోర్టులో ఒక్కో విధంగా పిటిషన్లు వేస్తూ న్యాయస్థానం విలువైన సమయాన్ని వృథా చేయడమే కాకుండా ట్రయల్‌ను అడ్డుకుంటున్నారు’ అని నాయవాది నివేదించారు. 

ఎన్నాళ్లు కోర్టు చుట్టూ తిరగాలి..
‘చార్జ్‌షీట్, రెండు అనుబంధ చార్జ్‌షీట్లు దాఖలు చేసి ఏళ్లు గడుస్తున్నా.. ట్రయల్‌ ఇంకా ప్రారంభం కాలేదు. సాక్ష్యాధారాలు లేకుండా నిందితులుగా చేర్చిన వారు ఎన్నాళ్లు కోర్టు చుట్టూ తిరగాలి? అది వారికున్న రాజ్యాంగ హక్కులను హరించడమే. ఏ కేసులోనైనా నిందితుల హక్కులను హరించే అధికారం ఎవరికీ లేదు. ఇదే విషయాన్ని ఇటీవల సుప్రీంకోర్టు పేర్కొంది. వీలైనంత సత్వరం విచారణ పూర్తి చేసి తీర్పులివ్వాలని ఆదేశించింది. 

ఈ కేసులో శివశంకర్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా కూడా అత్యున్నత న్యాయస్థానం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. దర్యాప్తు చేయమని కోర్టు ఆదేశిస్తే చేస్తామని సీబీఐ చెప్పడం సబబుకాదు. హత్య జరిగి దాదాపు ఏడేళ్లు కావొస్తున్నా ఇంకా దర్యాప్తు కొనసాగిస్తూపోతే విచారణ ముగిసేదెప్పుడు? నిందితులు ఎన్నాళ్లు కోర్టు చుట్టూ తిరగాలి. వారి హక్కులను కాపాడే బాధ్యత ఈ కోర్టుకు ఉంది. దర్యాప్తు కొనసాగింపు అవసరం లేదు’అని ఉమామహేశ్వర్‌రావు వాదనలు వినిపించారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)