Breaking News

AP: ‘రియల్‌’ రివర్స్‌! పడిపోయిన స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు

Published on Wed, 11/27/2024 - 05:15

విజయవాడ పటమట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సాధారణంగా ప్రతి నెలా సగటున వెయ్యి నుంచి 1,200 రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు 800 రిజిస్ట్రేషన్లు జరగడం కూడా గగనంగా ఉంది. గత మూడేళ్లూ స్థిరాస్తిలో దూసుకెళ్లిన విశాఖలో రిజిస్ట్రేషన్లు ఒక్కసారిగా పడిపోయాయి. తిరుపతిలోనూ భారీగా జరిగే రిజిస్ట్రేషన్లు అనూహ్యంగా తగ్గిపోయాయి.

సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం నేల చూపులు చూస్తోంది. స్థిరాస్థులరిజిస్ట్రేషన్లు దారుణంగా పడిపోయాయి. అమ్మకాలు, కొనుగోళ్ల లావాదేవీలతో కిటకిటలాడే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద అసలు సందడే కనిపించడంలేదు. ఈ ఏడాది జూన్‌ నుంచిరిజిస్ట్రేషన్లు తగ్గిపోవడంతో ఆ శాఖ ఆదాయం భారీగా తగ్గిపోయింది. గత సంవత్సరం వచ్చినంత ఆదాయం ఈసారి వచ్చే పరిస్థితి లేదని ఉన్నతాధికారులు పెదవి విరుస్తున్నారు. చంద్రబాబు గద్దెనెక్కితే రియల్‌ బూమ్‌ వస్తుందంటూ ప్రచారం చేసిన వారంతా ఈ పరిస్థితి చూసి నెత్తీ నోరూ బాదుకుంటున్నారు.

భారీగా తగ్గినరిజిస్ట్రేషన్లు.. 
2023–24లో రాష్ట్రవ్యాప్తంగా 21.91 లక్షల స్థిరాస్తులరిజిస్ట్రేషన్లు జరగగా అంతకుముందు రెండేళ్లు కూడారిజిస్ట్రేషన్ల సంఖ్య 26 లక్షలకుపైనే ఉంది. ఈ ఏడాది కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు జరిగినరిజిస్ట్రేషన్లు సుమారు 12 లక్షలు మాత్రమే. ఆరి్థక సంవత్సరం ముగియడానికి ఇక నాలుగు నెలల సమయం మాత్రమే మిగిలింది. కనీసం గతేడాది తరహాలోరిజిస్ట్రేషన్లు జరగాలన్నా సుమారు మరో 10 లక్షలరిజిస్ట్రేషన్లు జరగాలి. మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితులు గమనిస్తుంటే అది కష్టమేనని చెబుతున్నారు. సాధారణంగా ఏటారిజిస్ట్రేషన్ల సంఖ్య పెరుగుతుంది. ఈదఫా అదనంగా పెరగకపోగా గతంలో ఉన్న సంఖ్యను కూడా చేరుకునే అవకాశం కనిపించడంలేదు.  

లక్ష్యంలో సగం కూడా చేరుకోలేదు..  
ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.13,500 కోట్ల మేర ఆదాయాన్ని ఆర్జించాలనిరిజిస్ట్రేషన్ల శాఖ లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటివరకు రూ.5,500 కోట్ల లోపే సమకూరింది. అలాంటప్పుడు మరో నాలుగు నెలల్లో రూ.8 వేల కోట్ల ఆదాయాన్ని సాధించడం ఎలా సాధ్యమని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. గత సంవత్సరం (2023–24)లో రూ.9,546 కోట్ల ఆదాయం రాగా అంతకుముందు సంవత్సరం (2022–23)లో రూ.8,064 కోట్ల రాబడి వచ్చింది.రిజిస్ట్రేషన్ల ఆదాయం గతంలో టీడీపీ హయాంలో రూ.5 వేల కోట్ల లోపే ఉండగా వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా సుమారు రూ.10 వేల కోట్లకు చేరుకోవడం గమనార్హం. 

ప్రధాన జిల్లాల్లో నిరాశే.. 
ఈ ఆరి్థక సంవత్సరంలో విశాఖ జిల్లాలో లక్ష్యం రూ.1,526 కోట్లు కాగా దాని ప్రకారం అక్టోబర్‌ నాటికి  రూ.862 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా రూ.561 కోట్లు మాత్రమే వచ్చాయి. అక్టోబర్‌ నాటికి కాకినాడ జిల్లా రూ.347 కోట్ల ఆదాయాన్ని రాబట్టాల్సి ఉండగా రూ.196 కోట్లే సాధించగలిగారు. ఎనీ్టఆర్‌ జిల్లాలో అక్టోబర్‌ వరకు రూ.695 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా రూ.398 కోట్లే వచ్చాయి. గుంటూరు జిల్లాలో రూ.659 కోట్లకుగానూ రూ.483 కోట్లు మాత్రమే రాబడి వచ్చింది. తిరుపతి జిల్లాలో రూ.442 కోట్లకుగానూ రూ.252 కోట్ల ఆదాయం మాత్రమే లభించింది. నంద్యాలలో అయితే 50 శాతం తగ్గుదల నమోదు కాగా అనకాపల్లి, కర్నూలు, పుట్టపర్తి జిల్లాల్లో  తగ్గుదల 40 శాతం కంటే అధికంగా ఉంది.

త్వరలో మార్కెట్‌ విలువ పెంపు!
ఆదాయ లక్ష్యాన్ని సాధించాలంటే భూముల మార్కెట్‌ విలువలు పెంచడం మినహా మరో మార్గం లేదని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో మార్కెట్‌ విలువను 50 శాతం వరకు పెంచి ఆదాయం పెరిగినట్లు చూపించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంతో కొనుగోలుదారులపై ఆ మేరకు భారం పడనుంది. 

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)