Breaking News

కుల గణన నిర్ణయం చరిత్రాత్మకం 

Published on Mon, 10/16/2023 - 06:22

సాక్షి, అమరావతి: ఏపీలో కుల గణన చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం చరిత్రాత్మకమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంఘం అధ్యక్షుడు ఎన్‌.మారేష్‌ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తె­లు­పుతూ బీసీ సంఘాల నాయకులు క్షీరాభిషేకం చేశారు.

అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీలకు మేలు చేసే విషయంలో సీఎం జగన్‌ దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. కుల గణనను పూర్తి పారదర్శకంగా జరిపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీని వల్ల ఏ కుల జనాభా ఎంత అనేది స్పష్టంగా తెలుస్తుందన్నారు. తద్వారా వారికి దక్కాల్సిన ఫలాలు అందుతాయన్నారు. సీఎం జగన్‌ గత నాలుగేళ్ల పాలనలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు.

అలాగే పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టించడం ద్వారా దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారేష్‌ మాట్లాడుతూ.. సర్పంచ్‌ నుంచి రాజ్యసభ స్థా­నాల వరకు బీసీలకు రాజ్యాధికారంలో 65 శాతాని­కి పైగా వాటా ఇచ్చిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందన్నారు. ఇప్పుడు కుల గణన చేపట్టడం బీసీల జీవితాల్లోనే మర్చిపోలేని అంశమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభివృద్ధి ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘాల నాయకులు రాజేందర్, వెంకట సుబ్బారావు, జనార్ధన్, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)