Breaking News

భార్య మృతి.. ఆ కొద్ది సేపటికే భర్త కూడా!

Published on Sun, 12/31/2023 - 05:12

చిల్లకూరు(తిరుపతి జిల్లా):  కష్టసుఖాల్లో ఇన్నాళ్లూ తనతో పాటు నడిచిన తన అర్ధాంగి మృతిని భర్త తట్టుకోలేకపోయాడు. భార్య మరణించిన కొద్ది సేపటికే తాను ప్రాణాలు విడిచాడు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కడివేడు దళితవాడలో శనివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. కడివేడు గ్రామానికి చెందిన పల్లిపాటి నాగూరయ్య(68), రమణమ్మ(60)లు భార్యా భర్తలు. వీరికి కుమార్తె, ఇద్దరు కుమారులు. వీరందరికి వివాహాలు జరిపించి మనవళ్లు, మనమరాళ్లతో సంతోషంగా ఉంటున్నారు.

ఇదిలా ఉండగా, రమణమ్మకు ఇటీవల ఆరోగ్యం దెబ్బతిని మంచానికే పరిమితమైంది. వృద్ధాప్యంలోనూ నాగూరయ్య కూలి పనులకు వెళ్లి.. వచ్చిన డబ్బుకు తోడు ప్రభుత్వం అందించే పింఛన్‌తో ఆమెకు వైద్యం చేయిస్తున్నాడు. ఈ క్రమంలో ఆమె శనివారం వేకువజామున ప్రాణాలు విడిచింది.

ఈ విషయాన్ని గమనించిన రమణయ్య.. కుటుంబ సభ్యులను మేల్కొలిపి, తాను ఓ చోట అలా కూర్చుండి పోయాడు. నిద్ర లేచిన దగ్గర్నుంచి ఏమీ మాట్లాడకుండా ఉన్నాడని.. కుమారులు తండ్రి దగ్గరకు వెళ్లి కదిలించే ప్రయత్నం చేయగా.. అప్పటికే ఆయన ప్రాణాలు విడిచి ఉన్నాడు. గంటల వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరూ మరణించడంతో కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)