సాయం అందక చితికిపోయానని సీఎంవోకు మరణ సందేశం!

Published on Wed, 10/22/2025 - 05:00

రాయచోటి: ఆర్థిక సమస్యలతో చితికిపోయిన ఓ చిన్న పరిశ్రమ యజమాని కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆదివారం పంపిన మరణ సందేశం కలకలం రేపింది. బడుగు బలహీన వర్గాలకు ఆర్థిక చేదోడు పథకంలో భాగంగా అన్నమయ్య జిల్లా రాయచోటి పరిధిలోని దూల్లవారిపల్లి వద్ద రెడీమిక్స్‌ కాంక్రీట్‌ పరిశ్రమను శ్రీనివాసులు ఏర్పాటు చేసుకున్నారు. సొంత ఆస్తులు విక్రయించడంతోపాటు రూ.60 లక్షలు అప్పులు చేసి పరిశ్రమను నెలకొల్పిన ఆయన.. ప్రభుత్వం, బ్యాంకు నుంచి దాదాపు రూ.80 లక్షల మేర ఆరి్థక సాయం కోసం ఎదురు చూసి విసిగిపోయారు. 

అప్పులపై వడ్డీల భారం పెరిగిపోవడంతో ఆరి్థకంగా చితికిపోయాడు. ప్రభుత్వం ఏమాత్రం ఆదుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపిన సందేశంలో పేర్కొన్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని వేడుకున్నాడు. అయితే ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ, అర్బన్‌ సీఐ ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన స్పెషల్‌ పార్టీ పోలీసులు రెడీమిక్స్‌ పరిశ్రమ యజమాని మర్రిపాటి శ్రీనివాసులును ఆదివారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు కౌన్సెలింగ్‌ అనంతరం సంతకాలు తీసుకుని సోమవారం సాయంత్రం విడుదల చేశారు. 

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)