Breaking News

స్వగ్రామానికి తెలుగు విద్యార్థి మృతదేహం

Published on Tue, 10/10/2023 - 05:05

జి.కొండూరు: కొలంబియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తెలుగు విద్యార్థి బేతపూడి సుధీర్‌కుమార్‌ మృతదేహం స్వగ్రామమైన ఎన్‌టీఆర్‌ జిల్లా, జి.కొండూరుకు సోమవారం ఉదయం చేరింది. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్‌ కృషి, రాష్ట్ర ప్రభుత్వం చొరవతో  బాధిత తల్లిదండ్రులకు కుమారుడి చివరిచూపు దక్కింది. జి.కొండూరుకు చెందిన బేతపూడి దేవదాసు కుమారుడు సుదీర్‌కుమార్‌ అలియాస్‌ జోషీ (34) ఎంఎస్‌ చదివేందుకు 2018లో స్పెయిన్‌ వెళ్లాడు. అనేక కారణాలతో ఎంఎస్‌ పూర్తి చేయలేకపోయాడు. అక్కడే ఉంటూ పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తూ చదువు కొనసాగిస్తున్నాడు.

గతనెల 15వ తేదీన తన స్నేహితురాలైన తోటి విద్యార్థి జెస్సికా జన్మదిన వేడుకల నిమిత్తం కొలంబియా వెళ్లాడు. 19వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో మృతుడి తల్లిదండ్రులు బేతపూ­డి కేథరీన్, దేవదాసు తమ కుమారుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని తమ కుమారుడి ఆఖరి చూపు క ల్పించాలని వారు అభ్యర్థించారు. దీనిపై స్పందించిన స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్‌ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసు­కెళ్లారు.

ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్‌టీ) ద్వారా కొలంబియాలోని ఇండియన్‌ ఎంబ­సీతో సంప్రదింపులు జరిపి, జి.కొండూరు తరలించి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. బంధువులు, కుటుంబ సభ్యుల చివరిచూపు అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. తమ కుమారుడి చివరిచూపును కల్పించిన ఎమ్మెల్యేకు, రాష్ట్ర ప్రభుత్వానికి తామెప్పుడూ రుణపడి ఉంటామని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)