Breaking News

పండ్లకే నష్టం ఎక్కువ!

Published on Sat, 09/21/2024 - 04:04

సాక్షి, అమరావతి: పంటల కోత అనంతరం పండ్లకు అత్యధికంగా నష్టం వాటిల్లుతోందని, ఆ తరువాత ఆ నష్టం ఎక్కువగా కూరగాయల్లో ఉందని కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పండ్లు, కూరగాయలు కోత అనంతరం అధిక ఉష్ణాగ్రతల కారణంగా నాణ్యత క్షీణించడం, వృధా అవ్వడం జరుగుతోందని  పేర్కొంది. పండ్ల కోత అనంతరం దేశంలో 6.02 శాతం నుంచి 15.05 శాతం మేర నష్టపోతున్నాయని, ఆ తరువాత కూరగాయల్లో 4.87 శాతం నుంచి 11.61 శాతం మేర నష్టం వాటిల్లుతోందని అధ్యయనంలో తేలినట్లు తెలిపింది. 

ప్రధానమంత్రి కిసాన్‌ సంపద యోజన కింద పంట కోత అనంతరం నష్టాలను తగ్గించడం, విలువ జోడింపులు పెంచడం తదితర చర్యలను తీసుకుంటోందని కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. మెగా ఫుడ్‌ పార్క్‌లు, ఇంటిగ్రేటెడ్‌ కోల్డ్‌ చైన్, విలువ పెంపు మౌలిక సదుపాయాలను, ఆగ్రో ప్రాసెసింగ్‌ క్లస్టర్లను, ఫుడ్‌ ప్రాసెసింగ్‌–ప్రిజర్వేషన్‌ కెపాసిటీ  పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. 

ఫుడ్‌ ప్రాసెసింగ్, వ్యవసాయ ఉత్పత్తుల సంరక్షణ మౌలిక సదుపాయాల కోసం ఇప్పటికే దేశ వ్యాప్తంగా 1,680 ప్రాజెక్టులను మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. కోల్డ్‌ స్టోరేజీలు, గిడ్డంగులు, ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు కోసం బ్యాంకులు, ఇతర రుణ సంస్థల ద్వారా దీర్ఘకాలిక రుణాలను మంజూరు చేయడానికి  సులభతరం చేసిందని తెలిపింది. ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్యాకేజీ కింద వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ 
వివరించింది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)