Breaking News

దుర్గమ్మ ఆలయంలోకి దళితులకు అనుమతి నిరాకరణ

Published on Sun, 06/29/2025 - 05:17

చంద్రగిరి: రాష్ట్రంలో కులవివక్ష కోరలు చాస్తోంది. దళితులపై «అరాచకాలు తీవ్రస్థాయికి చేరాయి. ఈసారి ఏకంగా సీఎం చంద్రబాబు సొంత మండలమైన తిరుపతి జిల్లా చంద్రగిరిలో దళితులు తీవ్ర అవమానానికి గురయ్యారు. స్థానిక కనకదుర్గమ్మ ఆలయంలోకి దళితులకు అనుమతి లేదంటూ కొందరు అడ్డుకోవడం.. ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. బాధితులు తెలిపిన వివరాలు.. తిరుపతి జిల్లా శ్రీనివాసమంగాపురంలో  శ్రీకనకదుర్గమ్మకు తరతరాలుగా గ్రామస్తులు పూజలు చేస్తున్నారు. 

కొన్నేళ్ల క్రితం సింగు అనే సామాజికవర్గానికి చెందిన వారు శ్రీనివాసమంగాపురానికి వచ్చి అమ్మవారు తమ కులదైవమని.. ఇక్కడ పూజలు చేసుకుంటామని గ్రామ పెద్దల అనుమతి పొందారు. ఆ తర్వాత ఏడాదికోసారి వచ్చి పెద్ద ఎత్తున అమ్మవారికి పూజలు చేసి.. మొక్కులు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ పేరుతో ఓ ట్రస్ట్‌ను సైతం రిజిస్టర్‌ చేయించుకున్నారు. దీంతో మూడు నెలల క్రితం గ్రామస్తులకు, సింగులకు మధ్య వివాదం తలెత్తింది. ఆలయం తమదంటే.. తమదంటూ గొడవలు పడ్డారు. 

ఈనేపథ్యంలో గురువారం రాత్రి గ్రామానికి చెందిన కొందరు దళిత మహిళలు కనకదుర్గమ్మ దర్శనం కోసమని ఆలయానికి వెళ్లారు. వారిని ఆలయంలోని కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. మీరు ఆలయంలోకి రావడానికి వీల్లేదని అవమానించి వెనక్కి పంపించేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన దళితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం దళితులు అమ్మవారి ఆలయం వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. 

తమకు అమ్మవారి ఆలయంలోకి ప్రవేశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. వారంలో మూడు రోజులు వచ్చి పూజలు చేసుకునే సింగులు ఆలయం తమదనడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సొంత మండలంలోనే దళితులకు ఇంతటి అవమానం జరిగినా.. అధికారులు చర్యలు తీసుకోవడం లేదని దళిత సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి న్యాయం చేయకపోతే.. ఉద్యమిస్తామని హెచ్చరించారు. 

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)