Breaking News

ఎంతో ఆనందంగా ఉంది..

Published on Fri, 01/26/2024 - 04:46

సాక్షి, మచిలీపట్నం/సాక్షి, న్యూఢిల్లీ: స్వర మహేశ్వరిగా పేరు తెచ్చుకున్న ఉమామహేశ్వరి (63) సంస్కృతంలో హరికథ చెప్పిన తొలి మహిళా భాగవతారిణి. కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన ఈమె హరికథను చెప్పడంలో ఎన్నో విశిష్టతలు కలిగి ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’తో సముచిత గౌరవం ఇచ్చి ఎంపికచేసింది. చిన్నప్పుడు సరదాగా నేర్చుకున్న ‘కుమార సంభవం’ కథే ఇప్పుడు దేశ అత్యుత్తమ పురస్కారానికి ఎంపికయ్యేలా చేసింది.

ఈమె సావిత్రి, భైరవి, శుభపంతువరాలి, కేదారం, కళ్యాణి వంటి కథలను వివిధ రాగాల్లో చెప్పడంలో దిట్ట. నాన్న లాలాజీరావు నాదస్వర విద్వాంసుడు కావడం, అమ్మ సరోజినికి సంగీతంలో ప్రావీణ్యం ఉండడంతో చిన్నప్పటి నుంచే కళా రంగాన్ని ఎంచుకున్న ఉమామహేశ్వరి రాష్ట్రం గర్వపడేలా ఎదిగారు. ఈమె ప్రఖ్యాత నాదస్వర విద్వాన్‌ దివంగత దాలిపర్తి పిచ్చిహరి మనవరాలు కూడా. ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నా.. ఓనమాలు మాత్రం బందరులో నేర్చుకోవడంతో జిల్లా కళాకారులు, ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. త్వరలో రాష్ట్రపతి చేతులు మీదుగా పద్మశ్రీ అందుకోనున్న ఉమామహేశ్వరి తనను అవార్డు వరించడంపై స్పందించారు. ఆమె ఏమన్నారంటే..

సరదాగా నేర్చుకున్న కథే ఈ స్థాయికి చేర్చింది: 14వ ఏట హరికథకు జీవితం అంకితం చేశాను. అలా సరదాగా మహాకవి కాళిదాసు సంస్కృతంలో రచించిన కుమార సంభవంను నేర్చుకున్నాను. ఆ తర్వాత నేను ఎన్నో ప్రదర్శనలిచ్చాను. పదికిపైగా సంస్కృతం, 25కి పైగా తెలుగులో హరికథలు నేర్చుకున్నాను. దేశ, విదేశీ కళాకారుల నుంచి పురస్కారాలు అందుకున్నాను. గత ఏడాది ఫిబ్రవ­రిలో ప్రతిష్టాత్మక సంగీత్‌ నాటక్‌ అకాడమీ పురస్కా­రాన్ని అందుకున్నాను.

ఇవికాక.. యూనివర్సిటీలు, రాష్ట్ర స్థాయిలో ఎన్నో పురస్కారాలు అందుకున్నాను. 1993లో హార్వర్డ్‌ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్‌ వేదిక్‌ కాన్ఫరెన్స్‌ జరిగితే హాజరై సంస్కతంలో హరికథ చెప్పి ప్రశంసలు పొందాను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రస్తుతం నాట్యకారుడు, భర్త కళాకృష్ణతో హైదరాబాదులోని బేగంపేటలో ఉంటున్నాం. అమ్మనాన్నలు మరణించాక మచిలీపట్నంకు రావడంలేదు. మేం ఇక్కడ ఉంటున్నా నన్ను ఈ స్థాయికి చేరేలా ఓనమాలు దిద్దించిన బందరు అంటే ప్రేమే.

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)