Breaking News

AP: రోజూ జిల్లాకో లక్ష మందికి ‘ఉపాధి’ 

Published on Thu, 01/19/2023 - 08:06

సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ సీజను ముగుస్తుండటంతో పేదలు పనుల్లేక వలస పోయే పరిస్థితి లేకుండా ఉండాలన్నది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సంకల్పం. అందుకు అనుగుణంగా ఉపాధి హామీ పథకం ద్వారా రోజూ ప్రతి జిల్లాలో లక్ష మందికి పనులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మార్చి నెలాఖరుకి కనీసం ఐదు కోట్ల పని దినాల పాటైనా పేదలకు పనులు కల్పించేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. గత ఐదేళ్లుగా ఫిబ్రవరి, మార్చి నెలల్లో గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది కూడా పేదలకు సొంత గ్రామాల్లో పనుల కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామాల్లో పెద్ద ఎత్తున పను22ళ కల్పనపై గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ రోజూ జిల్లా అధికారులతో సమీక్ష చేస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో పనుల గుర్తింపుపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. 

ఈ ఏడాదిలో ఇప్పటికే రూ. 4,022 కోట్ల మేర ఉపాధి పనులు 
గత వేసవి కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి హామీ పథకం ద్వారా కల్పించిన పనులతో కలిసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (గత ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి) ఇప్పటివరకు 19.07 కోట్ల పనిదినాల పాటు ప్రభుత్వం పనులు కల్పించింది. 43.08 లక్షల కుటుంబాలకు చెందిన 76.08 లక్షల మంది వారి సొంత గ్రామాల్లోనే పనులు చేసుకొని ఇప్పటికే రూ. 4,022 కోట్లు లబ్ధి పొందారు. వీరిలో దాదాపు 34 శాతం ఎస్సీ, ఎస్టీలే. ఫిబ్రవరి, మార్చి నెలలో కూడా కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన దాదాపు 70 రోజుల్లో కనీసం ఐదు కోట్లు పనిదినాలు పని కల్పించాలని, మొత్తంగా ఈ ఏడాది 24 కోట్ల పనిదినాలు కల్పించాలని అధికారులు ఏర్పాట్లు చేశారు. 

పని దినాల కేటాయింపులు పెంచిన కేంద్రం 
కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఏడాది మూడో విడత పని దినాల కేటాయింపులు పెంచింది. ఈ ఆర్థిక ఏడాదికి మొదట రాష్ట్రానికి 14 కోట్ల పనిదినాలు మాత్రమే కేటాయించిన కేంద్రం.. గతంలో ఒక విడత మరో ఐదు కోట్ల పని దినాలకు ఆమోదం తెలిపింది. ఈ మొత్తం 19 కోట్ల పనిదినాలు కేటాయింపులు చేసింది. ఆ లక్ష్యం కూడా ఇప్పటికే పూర్తవడంతో మంగవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, రాష్ట్ర అధికారుల వర్చువల్‌ సమావేశంలో మరో 1.20 కోట్ల పని దినాను కేటాయించింది. దీనితో పాటు వచ్చే రెండు నెలల్లో అవసరం ఉన్న మేరకు మరిన్ని పని దినాల కేటాయింపులు పెంచేందుకు సిద్ధమంటూ కేంద్ర అధికారులు రాష్ట్రానికి స్పష్టమైన హామీ ఇచ్చినట్టు రాష్ట్ర గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు వెల్లడించారు. 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)