Breaking News

విశ్రాంత ఉద్యోగికి సైబర్‌ నేరగాళ్ల టోకరా

Published on Fri, 08/29/2025 - 02:43

నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన ఓ విశ్రాంత ఉద్యోగికి  సైబర్‌ నేరగాళ్లు టోకరా వేశారు. విడతలవారీగా రూ.30.70 లక్షలను స్వాహా చేశారు. నూజివీడుకు చెందిన నీలపాల చిన్నిరాజు సింగరేణి కాలరీస్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పనిచేసి 2011లో రిటైరయ్యారు. నూజివీడులో నివసిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌ 17న సాయంత్రం 4.41 గంటలకు ఒక వ్యక్తి ఫోన్‌ చేసి తాను సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సందీప్‌రావునని చెప్పి మాట్లాడారు. 

సుధాఖత్‌ ఖాన్‌ అనే నేరస్తుడిని తాము 2024 నవంబరు 2న ఢిల్లీలో అరెస్టు చేశామని, అతని వద్ద మీ ఆధార్‌ కార్డు ఉందని చెప్పాడు. ‘‘నేరస్తుడితో మీకు సంబంధాలు ఉండొచ్చుననే అనుమానం ఉంది. విచారణకు ఢిల్లీ రావాల్సి ఉంటుంది’’. అని ఫోన్‌లో ఒత్తిడి చేశాడు. ఆ తరువాత మరో వ్యక్తి ఫోన్‌ చేసి తాను సీబీఐ ఆఫీసర్‌ ఆకాశ్‌ కుల్హరినని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కొంత మొత్తం భద్రత డిపాజిట్‌ కింద జమ చేయాలని, తమకు సహకరించకపోతే అరెస్టు చేస్తామని హెచ్చరించాడు.

దీనికి భయపడిపోయిన చిన్నిరాజు తన ఇల్లు, బంగారం తాకట్టు పెట్టి విడతల వారీగా నిందితులు చెప్పిన బ్యాంకు ఖాతా­ల్లో రూ.30,70,450 జమ చేశారు. ఆగస్టు 14 నుంచి నిందితులు చిన్నిరాజుతో సంప్రదింపులు నిలిపివేయడంతోపాటు ఆయన నంబరును బ్లాక్‌ చేయడంతో అనుమానమొచి్చన చిన్నిరాజు తాను మోసపోయినట్టు గ్రహించి పోలీసులను ఆశ్రయించారు.
 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)