విద్యుత్‌ బిల్లుల పేరుతో సైబర్‌ మోసాలు 

Published on Sat, 07/29/2023 - 04:56

సాక్షి, అమరావతి: ‘డియర్‌ కన్స్యూమర్‌... మీ మునుపటి నెల బిల్లు అప్డేట్‌ కానందున ఈ రాత్రికి మీ విద్యుత్‌ సరఫరా నిలిపివేయబడుతుంది. దయచేసి బిల్లు చెల్లించడానికి కింది లింక్‌పై క్లిక్‌ చేయండి..’ అంటూ వస్తున్న వాట్సప్, టెక్ట్స్‌ మెసేజీలను నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్‌ మధ్య ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్‌) సీఎండీ జె.పద్మజనార్దనరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు.

రాష్ట్రంలో విద్యుత్‌ బిల్లుల సైబర్, ఆన్‌లైన్‌ మోసాలు గత కొన్ని నెలలుగా జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. మోసగాళ్లు ఆన్‌లైన్‌లో ప్రజల ఫోన్లను హ్యాక్‌ చేసి ఇలాంటి సందేశం పంపుతారని, వినియోగదారులు తమకు వచ్చిన మెసేజ్, లింక్‌పై క్లిక్‌ చేయవద్దని ఆయన సూచించారు.

పొరపాటున వారు పంపిన లింక్‌పై క్లిక్‌ చేస్తే వినియోగదారుల బ్యాంక్‌ ఖాతాలను ఖాళీ చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి మెసేజ్‌లు వస్తే విద్యుత్‌ అధికారులకు గానీ, సైబర్‌ క్రైం పోలీసులకు గానీ సమాచారం ఇవ్వాలని సూచించారు.

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)