Breaking News

రూ.1.23 కోట్ల సైబర్‌ దోపిడీ

Published on Fri, 01/02/2026 - 04:33

అద్దంకి:  సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుకుని కోటికి పైగా నగదు పోగొట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అద్దంకికి చెందిన ఎస్‌.నాగేశ్వరరావు బ్యాంక్‌ జనరల్‌ మేనేజర్‌గా పనిచేసి రిటైరయ్యారు. ప్రస్తుతం అద్దంకి పట్టణంలో భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. నవంబర్‌లో నాగేశ్వరరావుకు  అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. ‘మీ ఆధార్‌ కార్డు ప్రముఖ నేరగాడి వద్ద దొరికింది.

మిమ్మల్ని అరెస్ట్‌ చేస్తాం. డబ్బు ఇవ్వకుంటే భార్యాభర్తలిద్దరినీ ముంబై తీసుకొచ్చి జైల్లో పెడతాం’ అంటూ బెదిరించాడు. భయపడిన నాగేశ్వ­రరావు డిసెంబర్‌ 3న రూ.53 లక్షలు సైబర్‌ నేరగాడి ఖాతా­కు జమ చేశారు. ఇలా మొత్తం రూ.1.23 కోట్లు బదిలీ చేశారు. ఇంకా నగదు ఇవ్వాలంటూ ఆ వ్యక్తి పదే పదే ఫోన్‌ చేస్తుండటంతో అనుమానం వచ్చిన నాగేశ్వరరావు స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. సైబర్‌ క్రైం పోలీసులు నగదు జమ చేసిన 13 బ్యాంకు ఖాతాలను సీజ్‌ చేసి దర్యాప్తు చేపట్టారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)