Breaking News

రైతులను ఆదుకుంటాం

Published on Sun, 12/10/2023 - 05:13

కొత్తపేట: మిచాంగ్‌ తుపాను, భారీ వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుందని.. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) కేఎస్‌ జవహర్‌రెడ్డి చెప్పారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పలివెల–పల్లిపాలెం రోడ్డులో పడిపోయిన వరి పంటను, తడిసిన ధాన్యాన్ని సీఎస్‌ శనివారం పరిశీలించారు. తుపాను వల్ల నియోజకవర్గంలో వరి, ఉద్యాన పంటలకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వ విప్, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సీఎస్‌ జవహర్‌రెడ్డికి వివరించారు.

పూజారిపాలెం, చౌదరిపురం ప్రాంతంలో పొలాల ముంపునకు కారణమైన గోరింకల డ్రైన్‌ను సీఎస్‌కు చూపించారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో తీసుకున్న ముందస్తు చర్యలతో పాటు రైతులకు నష్టపరిహారం, పంటల బీమా తదితర విషయాల్లో చేపట్టిన చర్యలను సీఎస్‌కు కలెక్టర్‌ హిమాన్షు శుక్లా వివరించారు. ఈ సందర్భంగా సీఎస్‌ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ.. ముందస్తు చర్య­లతో తుపాను నష్టాన్ని చాలా వరకు నివారించినట్లు చెప్పారు. తడిసిన ధాన్యం కొనుగోలుకు ప్రభు­త్వం నిబంధనలు కూడా సడలించిందని వివరించారు.

పంట తడిసిపోవడం వల్ల ధాన్యం మొలకెత్తడం, రంగు మారడం, నూకలవ్వడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని, మిల్లర్లకు నిబంధనలు సడలించి.. వారికి తోలిన ధాన్యం ఎగుమతులకు అనుమతించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తున్నట్లు చెప్పారు. తద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలుతో పాటు మిల్లర్ల నుంచి ఎగుమతుల్లో ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

పంట నష్టాల నమోదు అనంతరం సాయం అందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కొత్తపేట ఆర్‌డీఓ ఎం.ముక్కంటి, ఎంపీపీ మార్గన గంగాధరరావు, జెడ్పీటీసీ గూడపాటి రమా­దేవి, మాజీ జెడ్పీటీసీ సాకా ప్రసన్నకుమార్, తహసీల్దార్‌ జీడీ కిషోర్‌బాబు, ఎంపీడీఓ ఇ.మహేశ్వరరావు, వ్యవసాయ అధికారి జి.పద్మలత తదితరులు  పాల్గొన్నారు

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)