Breaking News

తుపాకీతో కాల్చుకుని సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ ఆత్మహత్య

Published on Tue, 07/15/2025 - 04:50

కనగానపల్లి: ఆర్థిక సమస్యలు తాళలేక  శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన సీఆర్‌పీఎఫ్‌ జవాను కంచుకుంట మురళి (30) తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి సొంతూరు కనగానపల్లి మండలంలోని శివపురం కొట్టాల. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. శివపురం కొట్టాల గ్రామానికి చెందిన బోయ ముత్యాలప్ప కుమారుడు కంచుకుంట మురళి సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌గా ఏడేళ్ల నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. మురళి తల్లిదండ్రులు నాగలక్ష్మి, ముత్యాలప్ప వ్యవసాయ కూలీలు.

ఇంటర్‌ వరకు చదువుకున్న మురళి సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌గా ఎంపికయ్యాడు. ఐదేళ్ల క్రితం అనంతపురానికి చెందిన పావనిని వివాహం చేసుకోగా.. వీరికి నాలుగేళ్ల బాబు, రెండేళ్ల పాప ఉన్నారు. తండ్రి ముత్యాలప్పకు స్కిన్‌ క్యాన్సర్‌ రావడంతో వైద్యం కోసం రూ.30 లక్షల దాకా ఖర్చు చేశాడు. అయినా తండ్రి ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. దీనికి తోడు చెల్లికి వివాహం చేయలేక ఆర్థిక ఇబ్బందులు పడు­తున్నాడు. అలాగే ఏడాది క్రితం పెనుకొండ సమీపంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మురళి కారు కింద పడి దంపతులు మృతి చెందారు.

దీంతో మృతుల కుటుంబానికి పరిహారం చెల్లించాల్సి రావడంతో ఆర్థిక ఇబ్బందులు మరింత ఎక్కువ­య్యాయి. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గు­రైన మురళి ఆదివారం రాత్రి అనంతపురంలోని పు­ట్టింట్లో ఉంటున్న తన భార్య పావనికి ఫోన్‌ చేసి కుటుంబ సమస్యలపై కొంతసేపు మాట్లాడాడు. ఆ తర్వా­త కాసేపటికే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఆర్‌పీఎఫ్‌ అధికారులు చెప్పా­రు. మురళి మృతదేహానికి మంగళవారం అంత్యక్రియ­లు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)