ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు.. క్యూలైన్లు ఫుల్‌

Published on Fri, 10/20/2023 - 07:07

సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఆరోరోజు దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి. అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఇక, నేడు అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. అర్ధరాత్రి రెండు గంటల నుంచి దర్శనాలు మొదలయ్యాయి. 

కాగా, ఇంద్రకీలాదిపై వినాయకుడి గుడి నుంచి కొండపై వరకూ భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి. సుమారు నాలుగు లక్షల మంది భక్తులు వస్తారని అధికారుల అంచనా వేశారు. క్యూలైన్లు నిండిపోవడంతో వీఎంసీ వద్ద కంపార్ట్‌మెంట్లను పోలీసులు ఏర్పాటు చేశారు. మరోవైపు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు మధ్యాహ్నం ఇంద్రకీలాద్రికి రానున్నారు. ప్రభుత్వం తరఫున సీఎం జగన్‌.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. 

ఇక, మూలనక్షత్రం సందర్బంగా విశాఖలోని శారదాపీఠంలో అక్షరాభ్యాసాలు జరుగనున్నాయి. రాజశ్యామల అమ్మవారు సరస్వతీ దేవి అవతారంలో దర్శనమివ్వనున్నారు. దేవాలయంలో ఘనంగా పూజలు జరుగుతున్నాయి. 

మరోవైపు, తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు ఆరోరోజు తిరుమల శ్రీవారు.. హనుమంత వాహనంపై దర్శనమివ్వనున్నారు. అలాగే, రాత్రి గజవాహనంలో దర్శనమిస్తారు. ఇక, గురువారం గరుడోత్సవం సందర్భంగా రెండు లక్షలకు పైగా మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. గరుడోత్సవం సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 21 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి ఎనిమిది గంటలు, ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 66,757 కాగా, తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 26,395గా ఉంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం  3.53 కోట్లు.

ఇది కూడా చదవండి: వరుసగా మూడో ఏడాదీ  వైఎస్సార్‌ అవార్డులు

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)