amp pages | Sakshi

లోకంలో.. పలు కాకులు; ఆసక్తికర సంగతులు

Published on Tue, 02/16/2021 - 18:21

లోకులు పలు కాకులు అనే సామెత మనకు తెలిసిందే. ఆ సామెత ఎలా ఉన్నా.. కాకుల్లో పలు రకాలు ఉన్నాయి. మనం సాధారణంగా కావ్‌ కావ్‌ మంటూ చెవులు చిల్లులు పడేలా అరిచే నల్ల కాకులనే చూస్తాం. కానీ కాకుల్లో కూడా అందమైనవి. ఆకట్టుకునే రంగుల్లో ఉన్నవి కూడా లోకంలో ఉన్నాయి. కార్విడె కుటుంబానికి చెందిన కాకుల్లో హౌస్‌ క్రోలని, రావెన్స్‌ అని, జాక్‌డా అని, మాగ్‌ పీ అని రకరకాలుగా ఉన్నాయి. వాటి వివరాలు ఓ సారి చూద్దాం.   

రుఫోస్‌ ట్రీపీ..
కాకి జాతిదే అయినా ఇది గోధుమ రంగులో ఉంటుంది. భారత ఉపఖండం దీని ఆవాసం. సాధారణ వర్షపాతం ఉండే ప్రాంతాలు, అడవులు, పట్టణాల్లోని ఉద్యానవనాల్లో ఇది కనిపిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సర్దుకుపోతుంది. పళ్లు, గింజలు, కీటకాలు, చిన్న చిన్న జీవులు దీని ప్రధాన ఆహారం. 

వైట్‌ బెల్లీడ్‌ ట్రీ పీ..
తోక పొడుగ్గా, అందంగా ఉండే ఈ కాకి, ఎక్కువగా పశ్చిమ కనుమల్లో నివసిస్తుంది. రూఫోస్‌ ట్రీపీతో స్నేహం చేస్తుంది. జనావాసాలు అంటే దీనికి పడదు. గింజలు, కీటకాలు, సరీసృపాలు, ఎలుకలు దీని ఆహారం.

కామన్‌ గ్రీన్‌ మాగ్‌పీ..
దేశంలోని పక్షి జాతుల్లో అందమైనది. పచ్చని రంగుతో చూడముచ్చటగా ఉంటుంది. పరిమాణంలో చిన్నగా ఉండే ఈ కాకి హిమాలయాల్లో, ఈశాన్య భారతంలో కనిపిస్తుంది. 

ఇండియన్‌ జంగిల్‌ క్రో..
రతదేశం మొత్తం ఈ కాకి కనిపిస్తుంది. హౌస్‌ క్రోకి దీనికి తేడా స్పష్టంగా కనిపిస్తుంది. పూర్తి నల్లగా, కొంచెం పెద్దగా ఉంటుంది. జంగిల్‌ క్రో అయినా జనావాసాలకు దగ్గరలోనే నివసిస్తుంది.

లార్జ్‌ బిల్లెడ్‌ క్రో..
ది కూడా అడవి కాకిలాగే పెద్దగా ఉంటుంది. కానీ సైజులో తేడా కనిపిస్తుంది. భారత్, ఆగ్నేయ ఆసియా దేశాల్లోని కాకుల్లో ఇది స్పష్టంగా తెలుస్తుంది. ఇది కూడా ప్రతిభ గలది. పరిస్థితులకు అనుకూలంగా మారుతుంది. 

యెల్లో బిల్లెడ్‌ బ్లూ మాగ్‌పీ..
వైట్‌ బెల్లీడ్‌ ట్రీ పీలాగే దీనికి కూడా పొడవైన తోక ఉంటుంది. కామన్‌ గ్రీన్‌ మాగ్‌పీలా అందంగా ఉంటుంది. భారత ఉపఖండంలోని ఉత్తర ప్రాంతాల్లో ఇది నివసిస్తుంది. నేలపై ఉండే ఆహారాన్ని సేకరించి కడుపునింపుకుంటుంది. 

బ్లాక్‌ హెడెడ్‌ జే..
హిమాలయాల్లో ఈ కాకి జాతి జీవిస్తుంది. నేపాల్, భూటాన్‌ వ్యవసాయ భూముల్లో కూడా అప్పుడప్పుడూ కనిపిస్తుంది. దీని తలపైన నల్లగా ఉంటుంది. యూరేసియన్‌ జేకి ఇది దగ్గరి చుట్టం. అదే పరిమాణంలో కూడా ఉంటుంది.  

హౌస్‌ క్రో..
పంచంలో అన్ని ప్రాంతాల్లో సాధారణంగా కనిపించే కాకి ఇది. దీని ఆవాసాలు మనుషులకు చేరువలో ఉంటాయి. కాకి జాతుల్లో కర్ణకఠోరంగా కావ్‌ కావ్‌ మంటూ కూసే కాకి ఇదే. నల్లగా ఉన్నా.. కొంత భాగం బూడిద రంగులో మెరుస్తూ ఉంటుంది. 

కామన్‌ రావెన్‌..
కాకి జాతుల్లో పెద్ద వాటిల్లో ఇది ఒకటి. ఇది అత్యంత ప్రతిభ కలిగినది. తెలివైనది. అంతేగాక అవకాశవాది అనే పేరున్నది. వాయవ్య భారతంలో మాత్రమే కనిపిస్తుంది. రాజస్థాన్, పంజాబ్‌తో పాటు సమీపంలోని ఎడారుల్లో జీవిస్తుంది.

వెస్ట్రన్‌ జాక్‌డా..
కాకి జాతిలో చిన్న రకం ఇది. ఉత్తర భారత దేశంలోని కశ్మీర్‌లో కనిపిస్తుంది. తిండి విషయంలో ఇది కూడా అవకాశవాదే. ఇది పలు రకాలైన ఆహారం భుజిస్తుంది. మొక్కలు, క్రిములు చివరకు వాన పాములు లాంటి వాటికి కూడా గుటుక్కుమనిపిస్తుంది.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)