Breaking News

తగ్గనున్న వరి, గోధుమ, మొక్కజొన్న దిగుబడి

Published on Sun, 05/11/2025 - 05:43

సాక్షి, అమరావతి: దేశంలో వాతావరణ మార్పులు వరి, గోధుమ, మొక్కజొన్న  దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతాయని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌) అధ్యయనంలో తేలింది. అధ్యయన వివరాలను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  భూసారం, వర్షపాతం, పంట దిగుబడులపై  వాతావరణ మార్పుల ప్రభావం అంచనా కోసం ఈ అధ్యయనాన్ని నిర్వహించినట్లు పేర్కొంది. అధ్యయనంలో కొన్ని ముఖ్యాంశాలు.. 
»  వాతావారణ మార్పులతో ఖరీఫ్‌లో వర్షపాతం 2050 నాటికి 10.1 శాతం వరకు పెరగవచ్చు. 2080 నాటికి 18.9 శాతం పెరిగే అవకాశం ఉంది. రబీల్లో కూడా 2050 నాటికి 17 శాతం, 2080 నాటికి 26 శాతం మేర పెరిగే అవకాశం ఉంది.  అసమాన, భారీ వర్షపాతాలు దిగుబడులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయి.  
» లవణీయతకు  (నీటిలో కరిగిన ఉప్పు శాతం) లోనయ్యే భూముల విస్తీర్ణం 2030 నాటికి 6.7 మిలియన్‌ హెక్టార్ల నుండి 11 మిలియన్‌ హెక్టార్ల మేర పెరుగుతుంది. 
»   వాతావరణ మార్పులకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోకపోతే వర్షాధారిత వరి దిగుబడి 2050 నాటికి 20 శాతం, 2080కి  47 శాతం మేర తగ్గుతుంది. నీటి పారుదల ఆధారిత వరి దిగుబడి 2050 నాటికి 3.5 శాతం, 2080 నాటికి 5 శాతం మేర పడిపోతుంది. గోధుమ దిగుబడి కూడా 2050 నాటికి 19.3 శాతం,  2080 నాటికి ఏకంగా 40 శాతం మేర తగ్గుతుంది. ఖరీఫ్‌ మొక్క­జొన్న దిగుబడి 2050 నాటికి  19 శాతం వరకు, 2080 నాటికి 20 శాతం వరకు తగ్గుతుంది.  

తగిన చర్యలు తీసుకుంటున్నాం: వ్యవసాయ శాఖ
వాతావరణ మార్పుల కారణంగా వ్యవసాయ రంగంపై పడే ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందుకు అనుగుణంగా వ్యవసాయ సాంకేతికత అభివృద్ధి, పంట వైవిధ్య, భూసార పరిరక్షణ, సమగ్ర నీటి లభ్యతా  చర్యలు చేపట్టినట్లు వివరించింది. 76 ప్రోటోటైప్‌ ఇంటిగ్రేటెడ్‌ ఫారి్మంగ్‌ సిస్టమ్‌ నమూనాలను ఐసీఏఆర్‌ అభివృద్ధి చేసినట్లు కూడా కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది.  

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)