Breaking News

అసెంబ్లీ ఎల్‌అండ్‌టీకి.. హైకోర్టు ఎన్‌సీసీకి..

Published on Fri, 04/18/2025 - 03:23

సాక్షి, అమరావతి: అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మా­ణ టెండర్లను అధిక ధరలతో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. హైకోర్టు భవన నిర్మాణానికి రూ.752,06,25,211ను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి సీఆర్‌డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) టెండర్లు పిలిచింది. ఈ టెండర్‌లో 4.52 శాతం అధిక (ఎక్సెస్‌) ధరకు అంటే రూ.786,05,57,470.54 కోట్‌ చేసిన ఎన్‌సీసీ లిమిటెడ్‌ సంస్థ ఎల్‌–1గా నిలిచింది. అసెంబ్లీ భవన నిర్మాణానికి రూ.590,86,61,979ను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది. 

ఈ టెండర్‌లో 4.48 శాతం అధిక ధరకు అంటే రూ.617,33,70,035.66 కోట్‌ చేసిన ఎల్‌ అండ్‌ టీ లిమిటెడ్‌ సంస్థ ఎల్‌–1గా నిలిచింది. ఈ టెండర్లను ఈనెల 5న జరిగిన సమావేశంలో సీఆర్‌డీఏ అథారిటీ ఆమోదిస్తూ తీర్మానం చేసింది. అసెంబ్లీ భవన నిర్మాణ పనులను ఎల్‌ అండ్‌ టీకి, హైకోర్టు భవన నిర్మాణ పనులను ఎన్‌సీసీ సంస్థకు అప్పగించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈనెల 7న సీఆర్‌డీఏ కమిషనర్‌ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు పంపారు. 

వాటిని పరిశీలించిన ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్‌కుమార్‌ ఆమోదిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఆర్‌డీఏ అథారిటీ చేసిన తీర్మానం మేరకు అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణ పనులను ఆ సంస్థలకు అప్పగించడానికి చర్యలు తీసుకోవాలని సీఆర్‌డీఏ కమిషనర్‌ను ఆదేశించారు. కాగా, ఈ రెండు టెండర్లలో అధిక ధరలకు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.60.46 కోట్ల భారం పడింది. 

గత ప్రభుత్వం తెచ్చిన రివర్స్‌ టెండరింగ్‌ విధానం ప్రకారం టెండర్లు నిర్వహించి ఉంటే కనీసం 4.5 నుంచి 5 శాతం తక్కువ ధరకే పనులు చేయడానికి కాంట్రాక్టర్లకు ముందుకొచ్చేవారు. దీని వల్ల ఖజానాకు రూ.67.74 కోట్ల మేర ఆదా అయ్యేదని ఇంజినీరింగ్‌ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)