Breaking News

ఎవరి ఆస్తి ఎవరికి ఉచితంగా ఇస్తారు?

Published on Sat, 01/10/2026 - 05:23

సాక్షి, అమరావతి: ‘రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేస్తోంది. ఆ భూము­ల­ను అప్పనంగా కార్పొరేట్‌ సంస్థలకు దోచిపెడుతోంది. దాన్ని సమర్థించుకునేందుకు మంత్రి లోకేశ్‌ 99 పైసలకే కార్పొరేట్లకు భూములిచ్చేస్తా... మీకేంటి ఇబ్బంది? అని బరితెగించి మాట్లాడుతున్నారు. రైతుల పొట్టకొట్టి బలవంతంగా లాక్కున్న పంట భూములను కార్పొరేట్లకు ఉచితంగా ఇస్తారా?’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తంచేశారు.  సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు లోకనాథంతో కలిసి ఆయన శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు.

గతంలో తాము ఎవరికీ ఉచితంగా భూములు ఇవ్వలేదని లోకేశ్‌ చెప్పారని గుర్తుచేశారు. అప్పుడు మా­ర్కె­ట్‌ రేటుకే భూములు ఇస్తున్నామని, ఎవరెవరికి ఎన్ని కోట్ల రూ­పాయలకు భూములిచ్చారో లెక్కలతో సహా వెల్లడించారని తెలి­పా­రు. అలాంటిది ఇప్పుడు 99 పైసలకే భూములు ఇచ్చేస్తామని చెప్ప­డం బరితెగింపేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎవరి ఆస్తి? ఎవరికి 99 పైసలకిస్తారు? అలా ఇవ్వడానికి లోకేశ్‌కు ఏం హక్కుంది? అని శ్రీనివాసరావు ప్రశ్నించారు.   

విశాఖ రీజనల్‌ డెవలప్‌మెంట్‌ పేరుతో స్టీల్‌ ప్లాంట్‌ భూముల మళ్లింపు 
కొత్తగా విశాఖపట్నం రీజనల్‌ డెవలప్‌మెంట్‌ అంటూ నీతి ఆయోగ్‌ ఓ రిపోర్టు తయారు చేసిందని, దానిలో విశాఖ స్టీల్‌ ప్లాంటుకు చెందిన 2,500 ఎకరాలను నక్కపల్లిలో పరిశ్రమలు పెట్టడానికి ప్రైవేట్‌ వ్యక్తులకు మళ్లించండి... అని స్పష్టంగా ఉందని శ్రీనివాసరావు చెప్పారు. భూములను ఇష్టానుసారం ఇస్తున్నారని ప్రశ్నించినందుకు సీపీఎం నాయకుడు అప్పలరాజును తీసుకెళ్లి డిటైన్‌ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అప్పలరాజుపై కేసు లేదు, కోర్టు ముందు ప్రవేశపెట్టలేదు... ఎవరినీ కలవనీయడం లేదని ధ్వజమెత్తారు.

ఈ రకంగా ఎంతమందిని నిర్బంధించి, ఎన్ని అక్రమ కేసులు పెట్టి బెదిరించి రైతుల భూములను లాక్కుంటారని శ్రీనివాసరావు ప్రశ్నించారు. ‘సీపీఎం నాయకులు వేరేవారి స్క్రిప్ట్‌ చదువుతున్నా­రని మంత్రి లోకేశ్‌ ఆరోపించడం సరికాదు. గత ప్రభుత్వంపై మేం పోరాటాలు చేస్తే ఒప్పు.. ఇప్పుడు మీ తప్పులను నిలదీస్తే తప్పా?’ అని లోకేశ్‌ను శ్రీనివాసరావు ప్రశ్నించారు. కొత్త ఉపాధి హామీ చట్టానికి వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో జనవరి 18 నుంచి 31వ తేదీ వరకు ర్యాలీల ద్వారా ఇంటింటికి తిరిగి ప్రజలను చైతన్యవంతం చేస్తామని తెలిపారు. ఈ నెల 14న కొత్త ఉపాధి చట్టం ప్రతులను భోగి మంటల్లో దహనం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.   

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)