Breaking News

13 రోజులకు పరామర్శకు వస్తారా?

Published on Sat, 07/20/2024 - 03:49

పగిడ్యాల: మైనర్‌ బాలిక కుటుంబాన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల చెక్‌ను అందజేయడానికి శుక్రవారం ముచ్చుమర్రికి వ చ్చిన మంత్రులకు భంగపాటు తప్పలేదు. ఘటన జరిగి 13 రోజులైన పరామర్శించడానికి మనస్సు రాలేదా? అంటూ సీపీఎం నేతలు, స్థానికులు మంత్రులను ప్రశ్నించారు. 

కేసును సీబీఐకి అప్పగించాలని, పోలీసుల వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ హోం మంత్రి రాజీనామా చేయాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు.. మంత్రి ఫరూక్‌ను కోరారు. దీంతో మంత్రి ఆగ్రహిస్తూ మాకు తెలుసంటూ చులకన భావంతో మాట్లాడారు. దీంతో సీపీఎం నాయకుల్లో ఒక్కసారిగా ఆవేశం కట్టలు తెంచుకుంది. 

ఘటన జరిగి 13 రోజులవుతున్నా ఇప్పటి వరకు మృతదేహాన్ని బాధిత తల్లిదండ్రులకు అప్పగించలేకపోయారని నిలదీశారు. దీంతో కమ్యూనిస్టులకు, మంత్రులకు మధ్య మాటామాటా పెరిగింది. ఇది గమనించిన పోలీసు ఉన్నతాధికారులు, రోప్‌ పార్టీ సిబ్బంది కమ్యూనిస్టులను కట్టడి చేసేందుకు యత్నించారు. సమాధానం చెప్పాలని, లేదంటే వాహనాలను కదలనిచ్చేది లేదని కమ్యూనిస్టులు స్వరం పెంచడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది.

వెంటనే స్పందించిన రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సీపీఎం నాయకులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. సీపీఎం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా కాకుండా రూ.25 లక్షలు చెల్లించాలని,  కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం, ఐదెకరాల భూమి ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)