Breaking News

బ్యారేజ్‌లో బోట్లు వదిలారనడం సరికాదు: సీపీఐ నేతలు

Published on Tue, 09/17/2024 - 19:13

సాక్షి,విజయవాడ:ప్రకాశం బ్యారేజ్‌లో ఉద్దేశపూర్వకంగానే బోట్లు వదిలారంటూ టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని సీపీఐ నేతలు తప్పుపట్టారు.ప్రకాశం బ్యారేజ్ వద్ద వరదలకు కొట్టుకొచ్చిన బోట్లను మంగళవారం(సెప్టెంబర్‌17) సీపీఐ నేతల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడారు.

‘గతంలో ఎప్పుడూ రానంత వరద వచ్చింది.చంద్రబాబు వస్తే కరువు వచ్చేదని అనేవారు.ఈసారి అతివృష్టి వచ్చింది.వరదకు మొత్తం కొట్టుకుపోయింది.ప్రకృతి వైపరీత్యాలప్పుడు ఇలాంటివి జరగుతాయి. వీటిని భరించక తప్పదు.బ్యారేజ్‌ను కూల్చేయడానికే బోట్లు వదిలారనే వాదన సరికాదు.డీపీ నేతలు అతిశయోక్తి మాటలు మానుకోవాలి.వాస్తవాలు మాట్లాడాలి.రాష్ట్రప్రభుత్వం అసలైన దొంగలను గుర్తించాలి.

1902లో బుడమేరు యుటి(అండర్ టన్నెల్)కట్టారు.తక్షణమే ఈ ప్రభుత్వం బుడమేరు యుటి షేప్‌ను మార్చాలి.ఇప్పటి వరకు బోట్లేసుకుని తిరిగిన చంద్రబాబు బుడమేరు యుటి గురించి మాత్రం మాట్లాడటం లేదు.ఎంతసేపూ పడవల్లో తిరిగి బాధపడి అయ్యో అమ్మోఅని కన్నీళ్లు పెట్టుకుంటే కుదరదు.చంద్రబాబు ఇప్పటికైనా బుడమేరు యుటిని చూడాలి.యుద్ధప్రాతిపదికన రీ మోడల్‌ చేయాలి’అని నారాయణ డిమాండ్‌ చేశారు.

గ్రామాల్లో సాయమేది..? సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఫైర్

  • కొల్లేరు టు బుడమేరు పర్యటించాం
  • వరదల సమయంలో సీఎం,మంత్రులు అంతా విజయవాడపైనే దృష్టిపెట్టారు
  • గ్రామాల్లోకి వెళితే తమకు ఎలాంటి సహాయం అందలేదని బాధితులు చెబుతున్నారు
  • అధికారులెవరూ తమ వద్దకు రాలేదంటున్నారు
  • వేల ఎకరాల్లో పంట నష్టపోతే ఇప్పటికీ ఎన్యుమరేషన్ చేయలేదు
  • ప్రభుత్వ తీరుపై ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు
  • గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు ఏ చిన్న సాయం కూడా అందలేదు
  • చంద్రబాబుకు విజయవాడలో పబ్లిసిటీ బాగానే వచ్చింది..సంతోషం
  • గ్రామీణ,గిరిజన ప్రాంతాల్లో నష్టపోయిన వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది
  • బుడమేరు మాదిరిగానే కొల్లేరు కూడా ఆక్రమణలకు గురైంది
  • పెద్ద పెద్ద కోటీశ్వరులు కొల్లేరును ఆక్రమించుకున్నారు
  • బుడమేరు మాదిరి కొల్లేరును కూడా ప్రక్షాళన చేయాలి
  • కొల్లేరు,0బుడమేరు ఆక్రమణల పై సీఎం చంద్రబాబును కలుస్తాం
  • అవసరమైతే కేంద్రప్రభుత్వం దృష్టికి కూడా కొల్లేరు సమస్యను తీసుకెళతాం

ఇదీ చదవండి.. వరద బాధితులకు ప్రభుత్వ సాయమేది: బొత్స

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)