Breaking News

చినతిరుపతిలో 'ఘోరం'

Published on Fri, 10/31/2025 - 05:37

ద్వారకాతిరుమల: రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షే­త్రం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో దారు­ణం చోటు చేసుకుంది. చిన్న తిరుపతిగా పేరు­న్న ఈ ఆలయం గోశాలలో గురువారం ఒక ఆవు, దూడ మృత్యువాత పడటం కలకలం రేపింది. కరెంటు షాక్‌తో మృతి చెందాయని సిబ్బంది, కా­దు పాముకాటు వల్ల మృతి చెందాయని అధికా­రులు పరస్పర విరుద్ధ వాదనలు వినిపిస్తున్నారు. 

తిరుమల తర్వాత శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులు భారీగా తరలివచ్చే ఈ క్షేత్రంలో అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతు­న్నాయి. భక్తులు ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో మండిపడు­తున్నారు. వివరాల్లోకి వెళితే.. నిత్యం శ్రీవారి దర్శనానంతరం కొందరు భక్తులు ఆల­య తూర్పు ప్రాంతంలోని సప్త గోకులంలో గోపూ­జలు చేస్తు­న్నారు. ఇందుకోసం ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు దేవస్థానం సిబ్బంది గోసంరక్షణశాల నుంచి 9 ఆవులు, 9 దూడలను సప్త గోకులానికి తీసుకొస్తున్నారు. 

తిరిగి సాయంత్రం ఆరు గంటలకు గోసంరక్షణశాలకు తీసుకె­ళ్తు­న్నారు. రోజూ మాదిరిగానే గురువారం ఉదయం సప్తగోకులానికి వచ్చిన ఆవులు, దూడల్లో ఒక జంట (ఆవు, దూడ) సప్తగోకులం వెనుకకు వెళ్లి, ఫ్లడ్‌లైట్లు ఉన్న హైమాస్ట్‌ పోల్‌ వద్ద పడిపో­యాయి. వీటిని గమనించిన సిబ్బంది అధికారు­లకు సమాచారం ఇచ్చారు. ఇవి విద్యుదాఘాతం వల్ల మృతి చెందాయని కొందరు సిబ్బంది భావించగా, అవి పాము కాటు వల్లే మృతి చెందాయని అధికారులు చెబుతు­న్నారు. 

ఘటనా స్థలంలోని ఫ్లడ్‌లైట్లకు విద్యుత్‌ సర­ఫరా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఉంటుందని, ఆ తరు­వాత టైమర్‌ కంట్రోల్‌ ద్వా­రా ఆటోమేటిగ్గా విద్యుత్‌ సరఫరా నిలి­చి­పోతుందని అంటున్నారు. ప్రమాదం జరిగిన సమయం ఉదయం 6 తరు­వా­తేనని, దీన్ని బట్టి ప్రమాదాని­కి విద్యుదాఘాతం కారణం కాదని అధికారులు చెబుతున్నారు.

పోస్టుమార్టం నివేదికతోనే..పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాతే ఆవు, దూడ మృతికి కారణాలు తెలుస్తాయని మండల పశువైద్యాధికారి అంగర సురేష్‌ తెలిపారు. ఆవు, దూడ శరీర భాగాల నుంచి సేకరించిన నమూనాలను ఏలూరులోని యానిమల్‌ డిసీజ్‌ డయగ్నోస్టిక్‌ లేబొరేటరీ (ఏడీడీఎల్‌)కి పంపినట్టు చెప్పారు. అక్కడ నిర్ధారణ కాకపోతే విజయవాడలోని వెటర్నరీ బయోలాజికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (వీబీఆర్‌ఐ)కు పంపుతారని చెప్పారు. 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)