Breaking News

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు కోర్టు సమన్లు

Published on Sun, 07/13/2025 - 09:58

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: ఆంధ్రజ్యోతి ఎండీ వే­మూ­రి రాధాకృష్ణకు శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం సివిల్‌ జడ్జి కోర్టు సమన్లు జారీ చేసింది. తన పరువుకు భంగం కలిగించేలా అసత్యాలతో కూడిన వార్తను ప్రచురించిన ఆంధ్ర­జ్యోతి ఎండీ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవా­లని గతంలో హిందూపురం టూటౌన్‌ సీఐగా పనిచేసిన సీఐ రియాజ్‌ అహ్మద్‌ కోర్టులో పరు­వు నష్టం దావా వేశారు.

వ్యక్తిగత అంశాలను ఏబీఎన్‌ చానల్, ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురించి తన పరువుకు నష్టం కలిగించారంటూ సదరు సీఐ 2024లో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసును విచారించిన కోర్టు శుక్రవారం ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో పాటు స్థానిక విలేకరులకూ నోటీసులు పంపింది. ఆగస్టు 18న కోర్టుకు హాజరు కావాలని అందులో పేర్కొంది.

కాగా.. తనకు పెద్దిరెడ్డి రామ­చంద్రారెడ్డితో సంబంధాలున్నాయని, ఎన్నికల సమయంలో సహకరించేందుకే తనను హిందూపురం పంపించారని అబద్ధపు ప్రచా­రం చేసినట్టు సీఐ రియాజ్‌ అహ్మద్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా తాను 2024 జూన్‌ 6న సస్పెండ్‌ కాగా, 3వ తేదీనే సస్పెండ్‌ అయినట్టు కథనాలు ప్రసారం చేశారని,  దురుద్దేశ పూర్వకంగానే ఇలా ప్రసారం చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు.  

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు సమన్లు జారీ చేసిన హిందూపురం కోర్టు

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)