Breaking News

నేడు పీఎస్‌ఎల్‌వీ సీ60కి కౌంట్‌డౌన్‌ ప్రారంభం   

Published on Sun, 12/29/2024 - 05:38

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి సోమవారం రాత్రి 9.58 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ60 రాకెట్‌ను ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. ఆదివారం రాత్రి 8.58 గంటలకు శాస్త్రవేత్తలు కౌంట్‌డౌన్‌ ప్రారంభించనున్నారు. 25 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం సోమవారం రాత్రి 9.58 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ60 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. 

ఇందుకోసం ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ ఆదివారం రాత్రికి బెంగళూరు నుంచి షార్‌కు చేరుకోనున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభించనున్నారు. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది 62వ ప్రయోగం కాగా.. పీఎస్‌ఎల్‌వీ కోర్‌ అలోన్‌ దశతో చేసే 18వ ప్రయోగమిది. పీఎస్‌ఎల్‌వీ విజయాలకు చిహ్నంగా మారిపోయింది. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 59 ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించారు. 

పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ 44.5 మీటర్లు ఎత్తు, 320 టన్నుల బరువు ఉంటుంది. కానీ పీఎస్‌ఎల్‌వీ 60కి స్ట్రాపాన్‌ బూస్టర్లు లేనందున 229 టన్నుల బరువే ఉంటుంది. కోర్‌ అలోన్‌ దశతోనే ఈ ప్రయోగాన్ని ప్రారంభిస్తారు. రెండో దశలో ద్రవ ఇంధనం, మూడో దశలో ఘన ఇంధనం, నాలుగో దశలో ద్రవ ఇంధనంతో రాకెట్‌ను ప్రయోగిస్తారు.  

చంద్రయాన్‌–4కు ఉపయోగపడేలా.. 
ఇస్రో సొంత సాంకేతిక పరిజ్ఞానంతో స్పాడెక్స్‌ అనే జంట ఉపగ్రహాలను రూపొందించింది. వీ­టికి ఛేజర్, టార్గెట్‌ అని పేర్లు పెట్టింది. ఈ రెండు ఉపగ్రహాలు 440 కిలోల బరువు ఉంటా­యి. ఇవి స్పేస్‌ డాకింగ్, ఫార్మేషన్‌ ఫ్లయింగ్, మానవ అంతరిక్షయానం, తదితర సేవలకు ఉపయోగపడతాయని ఇస్రో తెలిపింది. 

భవిష్యత్తులో నిర్వహించే చంద్రయాన్‌–4లో భారత్‌ స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణానికి అవసరమైన డాకింగ్‌ టెక్నాలజీని పరీక్షించేందుకు ఈ ఉపగ్రహాలు ఉపయోగపడతాయని పేర్కొంది. స్పాడెక్స్‌లో అమ­ర్చి­న జంట ఉపగ్రహాలు ఒకదానితో ఒకటి అనుసంధానమై పనిచేస్తాయి. 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)