Breaking News

AP: ఏడాదిలోనే జీతాల వ్యయం.. రూ.8,068కోట్లు పెరుగుదల 

Published on Wed, 06/07/2023 - 05:15

సాక్షి, అమరావతి: దేశంలోని పలు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వోద్యోగుల వేతనాల వ్యయం భారీగా పెరిగింది. అదే సమయంలో పెన్షన్ల వ్యయం కూడా భారీగానే అయింది. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) 2022–23 ఆర్థిక ఏడాదికి సంబంధించిన ప్రాథమిక గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.

ఏడాది వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం భారీగా పెరిగింది. మరోపక్క.. తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, బిహార్‌ రాష్ట్రాల కన్నా ఏపీలోనే ఉద్యోగుల వేతనాల వ్యయం అధికంగా ఉందని కాగ్‌ తెలిపింది. నివేదిక ముఖ్యాంశాలు ఏమిటంటే..

♦ 2021–22తో పోలిస్తే రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగుల వేతనాల వ్యయం 2022–23లో రూ.8,068.39 కోట్లు పెరిగింది. 
♦  ప్రభుత్వోద్యోగుల పెన్షన్ల వ్యయం 2021–22తో పోలిస్తే  2022–23లో రూ.2,257.29 కోట్లు పెరిగింది.
♦  2021–22 ఆర్థిక ఏడాదిలో ప్రభుత్వోద్యోగుల వేతనాల వ్యయం ఏపీలో రూ.40,895.83 కోట్లు ఉండగా 2022–23లో అది ఏకంగా రూ.48,964.22 కోట్లకు పెరిగింది.
♦  అలాగే, 2021–22లో ప్రభుత్వోద్యోగుల పెన్షన్ల వ్యయం రూ.20,326.67 కోట్లు కాగా, 2022–23లో అది రూ.22,583.96 కోట్లకు పెరిగింది.



..ఇలా రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం ఏటేటా పెరుగుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 11వ పీఆర్సీని అమలుచేయడంతో పాటు ఉద్యోగులకు డీఏలు ఇవ్వడంతో వేతనాల వ్యయం భారీగా పెరుగుతోంది. మరోవైపు.. వైద్య ఆరోగ్య శాఖలో ఏ ఒక్క పోస్టు ఖాళీలేకుండా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తోంది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)