Breaking News

వైద్య శాఖలో మరో అవినీతి టెం‘ఢర్‌’

Published on Mon, 01/19/2026 - 04:33

సాక్షి, అమరావతి: రూపాయి వస్తువును పది రూపాయలకు కొనడం.. అదనంగా వెచ్చించే సొమ్మును కాంట్రాక్టర్‌ ద్వారా కమీషన్ల రూపంలో జేబుల్లో వేసుకోవడంలో అరితేరిపోయారు ప్రభుత్వ పెద్దలు. వీరి ధనదాహానికి కొందరు అధికారులు కూడా తోడై ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. చివరకు ప్రజారోగ్యానికి భరోసాగా నిలవాల్సిన ఆరోగ్య శాఖను సైతం వదలకుండా దోచేస్తున్నారు. వైద్య పరికరాల మాటున భారీ స్కామ్‌లకు పాల్పడుతున్నారు. పరికరాల కొనుగోళ్లలో ధరలను అమాంతం పెంచేసి కమీషన్ల రూపంలో అధికారులు, నేతలు పెద్దఎత్తున దండుకుంటున్నారు. ప్రభుత్వాస్పత్రులకు వాక్యూమ్‌ ఎక్స్‌ట్రాక్టర్‌ పరికరాల కొనుగోలు కుంభకోణమే దీనికి తాజా ఉదాహరణ. 

రూ.4 కోట్లకు పైనే కొట్టేసేలా కుట్ర 
సాధారణ ప్రసవం సందర్భంగా తల్లి గర్భం నుంచి శిశువు బయటకు వచ్చే సమయంలో అవరోధాలు ఉంటే.. శిశువును బయటకు తీయడం కోసం వాక్యూమ్‌ ఎక్స్‌ట్రాక్టర్‌ను ఉపయోగిస్తారు. వీటిని ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేయడం కోసం గత ఏడాది సెపె్టంబర్‌లో ఒక్కో పరికరానికి రూ.3,13,598 చొప్పున వెచ్చించేలా ఏపీఎంఎస్‌ఐడీసీ రేట్‌ కాంట్రాక్ట్‌ ఖరారు చేసింది. మెడిసిల్‌ కంపెనీకి చెందిన ఈ పరికరాలను ఆస్పత్రులకు సరఫరా చేసేందుకు విశాఖ హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ కాంట్రాక్ట్‌ దక్కించుకుంది.

వాస్తవానికి ఇదే పరికరాన్ని తయారీ సంస్థ (మెడిసిల్‌) రూ.1.04 లక్షలకు హైదరాబాద్‌లోని పేట్లబుర్జు మహాత్మాగాంధీ మెటర్నిటీ హాస్పిటల్‌(ఎంజీఎంహెచ్‌)కు సరఫరా చేసింది. 2021–22 మధ్య రూ.1.15 లక్షల నుంచి రూ.1.25 లక్షల ధరకు తయారీ సంస్థ పరికరాలను విక్రయించింది. ఈ అంశాలన్నింటినీ గతేడాది తెలంగాణ ఎంఎస్‌ఐడీసీ నిర్వహించిన ఓ టెండర్‌లో మెడిసిల్‌ సంస్థ స్పష్టం చేసింది. కాగా, ఇదే కంపెనీకి చెందిన పరికరాన్ని ఏకంగా రూ.3.13 లక్షలకు కొనుగోలు చేసేలా ఏపీ వైద్య శాఖ రేట్‌ కాంట్రాక్ట్‌ ఖరారు చేయడం చర్చనీయాంశంగా మారింది.

బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేసిన ఒక్కో వాక్యూమ్‌ ఎక్స్‌ట్రాక్టర్‌ ధర రూ.1.50 లక్షల కంటే ఎక్కువ ఉండదని మెడికల్‌ ఏజెన్సీలు స్పష్టం చేస్తున్నాయి. సాధారణంగా ఎంఎస్‌ఐడీసీ టెండర్లలో తయారీ సంస్థలు కాకుండా డీలర్స్‌ పాల్గొంటూ ఉంటారు. వీరు 10 శాతం నుంచి 20 శాతం మేర మార్జిన్‌ పెట్టుకుని టెండర్లు వేస్తుంటారు. అయితే, కాంట్రాక్ట్‌ సంస్థ ఏకంగా రెండు రెట్లు అధికంగా ధరలు వేయడం వెనుక నేతలు, అధికారుల హస్తం ఉందని తెలుస్తోంది. 

భారీ అవినీతికి స్కెచ్‌
గతేడాది సెపె్టంబర్‌లో ప్రభుత్వం రేట్‌ కాంట్రాక్ట్‌ ఖరారు చేయడం వెనుక భారీ అవినీతి స్కెచ్‌ ఉంది. అప్పట్లో పది పరికరాలను కొనుగోలు చేయడానికి రేటు కాంట్రాక్టు ఖరారు చేశారు. అనంతరం రెండు నెలలకే సెకండరీ హెల్త్‌ ఆస్పత్రులకు 230 వాక్యూమ్‌ ఎక్స్‌ట్రాక్టర్‌ల అవసరం ఉందని ఎంఎస్‌ఐడీసీకి ఇండెంట్‌ వచ్చినట్టు సమాచారం. వీటి కొనుగోలు చేసేందుకు ఎంఎస్‌ఐడీసీ ఖరారు చేసిన ధర ప్రకారం రూ.7 కోట్లకు పైగానే ఖర్చవుతుంది. అదే తయారీ సంస్థ వాస్తవ ధరలతో పోలిస్తే రూ.2.50 కోట్ల నుంచి రూ.3 కోట్లలోపే ఖర్చు అవుతుంది. ఈ లెక్కన అధిక ధరకు పరికరాలు కొనుగోలు చేయడం ద్వారా ఏకంగా రూ.4 కోట్ల మేర కమీషన్ల రూపంలో కొందరు అధికారులు, నేతలు కొల్లగొట్టడానికి స్కెచ్‌ వేసినట్టు తేటతెల్లం అవుతోంది. ఇదే ధరలో కాంట్రాక్ట్‌ సంస్థకు పర్చేజ్‌ ఆర్డర్‌ ఇచ్చేందుకు వైద్య శాఖ సిద్ధమవుతోంది.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)