Breaking News

సింగపూర్‌ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా

Published on Thu, 04/13/2023 - 07:30

చోడవరం రూరల్‌ (అనకాపల్లి జిల్లా): సింగపూర్‌ నుంచి వచ్చిన వ్యక్తికి విశాఖ విమానాశ్రయంలో జరిపిన కరోనా పరీక్షలో పాజిటివ్‌ నిర్ధారణ అయింది.  వివరాల్లోకి వెళితే... అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలోని జన్నవరం గ్రామానికి చెందిన 33 ఏళ్ల వ్యక్తి  సింగపూర్‌లో పనిచేస్తున్నాడు. సెలవు దొరకడంతో ఊరికి వచ్చాడు. ఆదివారం విశాఖ విమానాశ్రయంలో దిగిన ఆయనకు ఎయిర్‌పోర్టులో వైద్య పరీక్షలు జరిపారు.

అనంతరం అతడు మండలంలోని జన్నవరానికి, సోమవారం అత్తగారి ఊరైన శ్రీరాంపట్నం వెళ్లాడు. అయితే అతనికి కోవిడ్‌ నిర్ధారణ అయినట్టు మంగళవారం ఎయిర్‌పోర్టు అథారిటీ వైద్య వర్గాల నుంచి గవరవరం వైద్య కేంద్రానికి సమాచారం అందింది. దీంతో వైద్యాధికారి దమయంతీదేవి సిబ్బంది జన్నవరం, శ్రీరాంపట్నం గ్రామాలకు చేరుకుని సింగపూర్‌ నుంచి వచ్చిన వ్యక్తి భార్య, పిల్లలు, అత్తమామల పరీక్షలు చేశారు.

వీరిలో భార్యకు మాత్రం కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. భార్యాభర్తలిద్దరినీ జన్నవరంలో వారి గృహంలోనే ఐసోలేషన్‌లో ఉంచామని, వారికి వైద్య సేవలు అందిస్తున్నామని వైద్యాధికారి తెలిపారు. జన్నవరం, శ్రీరాంపట్నం గ్రామాల్లో  ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని, ప్రజలు భయపడాల్సిందేమీ లేదన్నారు.
చదవండి: భారత్‌లో ఎండెమిక్‌ స్టేజ్‌కు కరోనా.. అధికారుల కీలక ప్రకటన

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)