Breaking News

దేశానికే ఆదర్శం.. ‘అల్లూరి’ జిల్లా

Published on Sat, 08/23/2025 - 07:01

సాక్షి, న్యూఢిల్లీ: నీతి ఆయోగ్‌ ప్రారంభించిన ఆకాంక్ష జిల్లాల కార్యక్రమానికి ఎంపికైన అల్లూరి సీతారామరాజు జిల్లా ఇప్పుడు సహకార ఆధారిత అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా మారింది. ఎన్నో ఏళ్లుగా స్వచ్ఛంద సంస్థలు వేర్వేరుగా పని చేస్తూ.. పరిమిత ఫలితాలు మాత్రమే సాధించాయి. దీనిని అధిగమించేందుకు జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన డి్రస్టిక్ట్‌ నాన్‌ ప్రాఫిట్‌ ఫోరం(డీఎన్‌ఎఫ్‌) కీలక మార్పులు తెచ్చిందని  ఇటీవల విడుదల చేసిన నివేదికలో నీతి ఆయోగ్‌ పేర్కొంది.  

ఒకే వేదికపై స్వచ్ఛంద సంస్థలు.. 
జిల్లాలోని స్వచ్ఛంద సంస్థలు, అభివృద్ధి భాగస్వాములు, ప్రభుత్వ యంత్రాంగం, గ్రామ పంచాయతీలు డీఎన్‌ఎఫ్‌ ద్వారా ఒకే దారిలో పయనించాయి. దీంతో ప్రణాళికలు సక్రమంగా అమలవ్వడంతో పాటు సత్ఫలితాలు గ్రామస్థాయికి చేరాయి. గిరిజనులకు కాఫీ ఆధారిత జీవనోపాధి బలపడింది. గ్రామాల్లో తాగునీరు, ఆరోగ్య సదుపాయాలు మెరుగయ్యాయి. అదనంగా.. ఐదు గ్రామాల్లో సుస్థిర వ్యవసాయ పద్ధతుల పైలట్‌ ప్రాజెక్ట్‌ అమలు చేసి రైతులకు కొత్త మార్గాలను చూపించారు. యువత, సివిల్‌ సొసైటీ భాగస్వామ్యం పెరిగి పంచాయతీల స్థాయిలో నిర్ణయాలు బలపడ్డాయి. 

సంఘటిత వేదిక లేకుండా అభివృద్ధి కష్టమని అల్లూరి జిల్లా ద్వారా స్పష్టమైందని నీతి ఆయోగ్‌ పేర్కొంది. డేటా ఆధారిత నిర్ణయాలు, పారదర్శక సమీక్షలు విశ్వసనీయతను తెచ్చాయని ప్రశంసించింది. గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికల్లో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం కూడా మంచి ఫలితాలను ఇచి్చందని పేర్కొంది. అభివృద్ధిలో సమన్వయం, సహకారం, సమగ్రత అనే సూత్రాలతో ముందుకు సాగుతున్న అల్లూరి సీతారామరాజు జిల్లా ఇప్పుడు దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని అభినందించింది.   

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)