Breaking News

నేటి నుంచి ప్రజల నెత్తిన ‘బండ’

Published on Tue, 04/08/2025 - 05:56

సాక్షి, అమరావతి: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.50 పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ పెంపు ఉజ్వల కనెక్షన్లకు కూడా వర్తిస్తుందని పేర్కొంది. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరుగుతున్న తరుణంలో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు సిలిండర్‌ రేటు కూడా పెరగడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 

రూ.525 కోట్లకుపైగా భారం 
ప్రస్తుతం రాష్ట్రంలో 14.20 కిలోల వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర సగటున రూ.830 వరకు ఉంది. తాజా పెంపుతో రూ.880కి చేరనుంది. ఏపీలో కోటిన్నరకు పైగా యాక్టివ్‌ గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. సగటున ఒక కుటుంబం ఏడాదికి ఏడు సిలిండర్లు వినియోగిస్తుందనుకుంటే.. రూ.5,810 చెల్లించాలి. కానీ పెరిగిన ధరల ప్రకారం ఇకపై రూ.6,160 చెల్లించాల్సి వస్తుంది. కోటిన్నర కుటుంబాలపై ఈ గ్యాస్‌ ధర పెంపు భారం ఏడాదికి రూ.525 కోట్లకుపైగా పడనుంది. 

ఇందులో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో వినియోగదారుడి బ్యాంకు ఖాతాలో వేసేంది మాత్రం రూ.10లోపే ఉంటోంది. సాధారణంగా ప్రతి నెలా 1న వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరలు మారతాయి. కొద్ది రోజులుగా కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలను పెంచుతూ వచి్చన కంపెనీలు, ఏప్రిల్‌ 1న గ్యాస్‌ సిలిండర్ల కొత్త రేట్లు ప్రకటించాయి. ఇందులో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలను తగ్గించాయి. ఇంతలోనే వంట గ్యాస్‌ సిలిండర్ల ధరలను అనూహ్యంగా పెంచడంతో సామాన్యుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)