Breaking News

ఉద్యోగ భద్రత లేకుంటే జీవితం రోడ్డున పడ్డట్లే

Published on Tue, 06/24/2025 - 04:29

సాక్షి, అమరావతి/మంగళగిరి టౌన్‌: న్యాయం కోసం రోడ్డెక్కిన కాంట్రాక్టు అధ్యాపకులపై కూటమి సర్కారు ఉక్కుపాదం మోపింది. శాంతియుతంగా నిరసన తెలియజేసే ప్రాథమిక హక్కును పోలీసుల బలగాలతో కాలరాసింది. దీంతో అధ్యాపకులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగి్వవాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ యూనివర్సిటీల్లో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు సోమవారం మంగళగిరిలోని ఉన్నత విద్యా మండలి కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. కూటమి ప్రభుత్వంలో హక్కులకు పాతరేస్తూ తీసుకొచి్చన కొత్త కాంట్రాక్టు అగ్రిమెంట్‌లోని నిబంధనను తప్పుపట్టారు.

ఉద్యోగ భద్రత లేకపోతే తమ జీవితాలు రోడ్డునపడినట్లేనని ఆందోళన వ్యక్తంచేశారు. చాలీచాలని జీతాలతో కుటుంబాలను వెళ్లదీస్తున్న తమను నిత్యం మానసికంగా చంపేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. దశాబ్దాలుగా వర్సిటీల్లో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న తమకు మినిమం టైమ్‌ స్కేల్‌ (ఎంటీఎం) అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రెగ్యులర్‌ సిబ్బందిలా తమకు డీఏ, హెచ్‌ఆర్‌ఏలతో కూడిన ఎంటీఎంను అందించాలని కోరారు.

ఉద్యోగ విరమణ వయసును 62 నుంచి 65కు పెంచాలని, భవిష్యత్తులో వర్సిటీల్లో నియామకాల సమయంలో తమ పోస్టులను మినహాయించి నోటిఫికేషన్‌ ఇవ్వాలన్నారు. అనంతరం ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ మధుమూర్తినికి వినతిపత్రం సమరి్పంచారు.  ఏపీ యూనివర్సిటీ టీచర్స్‌ అసోసియేషన్స్‌ సమాఖ్య(కాంట్రాక్టు), అధ్యక్షుడు డాక్టర్‌ కె.అర్జునుడు తదితరులు పాల్గొన్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)