Breaking News

గురుకులంలో ‘కలుషిత ఆహారం!

Published on Sat, 08/16/2025 - 05:02

చిలమత్తూరు:  శ్రీసత్యసాయి జిల్లా, హిందూపురం మండలం, మలుగూరు ప్రభుత్వ ఎంజేపీ గురుకుల పాఠశాలలో శుక్రవారం ఉదయం అల్పాహారం తిన్న 10 మంది విద్యార్థులు వాంతులు చేసుకుని తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రి పాలయ్యారు. ఇది జ్వర సంబంధ అస్వస్థత అని వైద్యులు చెబుతున్నప్పటికీ, కలుషిత ఆహారమే కారణమని చెబుతున్నారు. ఘటన కారణాన్ని కావాలనే పక్కదారి పట్టిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

వాంతులు చేసుకున్న అఖిల నందన్, వరుణ్‌కుమార్, దేవా నాయక్, మహీధర్, కౌశిక్, లిఖిత్, వరుణ్‌ సందేశ్, అభిరామ్, దినేష్ సహా మొత్తం 10 మంది విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారిని వెంటనే పాఠశాల సిబ్బంది 108 వాహనంలో హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

హిందూపురానికి గురువారం చుట్టపుచూపుగా వచ్చిన ఎమ్మెల్యే బాలకృష్ణ, టేకులోడు గురుకుల పాఠశాలలో మాట్లాడుతూ విద్యా వ్యవస్థను కూటమి ప్రభుత్వం మెరుగుపరిచిందని వ్యాఖ్యానించిన నేపథ్యంలోనే తాజా ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. సొంత నియోజకవర్గంలో చోటుచేసుకున్న తాజా ఘటనపై ఆయన ఆరా తీయకపోవడంపై కూడా విమర్శలు వస్తున్నాయి.  

కలుషిత ఆహారమే కారణం: వైఎస్సార్‌సీపీ 
విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్‌ దీపిక, ఆమె భర్త వేణురెడ్డి పార్టీ నాయకులతో కలిసి ప్రభుత్వాసుపత్రికి చేరుకుని విద్యార్థులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ, కలుషిత ఆహారమే తాజా పరిస్థితికి కారణమన్నారు. 

సుమారు 600 మంది విద్యార్థులున్న  పాఠశాలలో నాణ్యత లేని ఆహారం పెడుతున్నారని మండిపడ్డారు.  జ్వరం వల్లనే విద్యార్థులు ఆసుపత్రికి వచ్చారని వైద్యులు తెలపడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జ్వరం వస్తే ఒక్కరికో ఇద్దరికో వస్తుంది. కానీ ఒకేరోజు, ఒకేసారి 10  మంది విద్యార్థులు ఎలా ఆసుపత్రిలో చేరారో సమాధానం చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు.

Videos

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

జోగి రమేష్ హౌస్ అరెస్ట్

ఆ 15 స్థానాల్లో పోటీయే లేదు..! లైవ్ లో మొత్తం బయటపెట్టిన YS జగన్

సంచలనం రేపుతున్న ప్రశాంత్ భూషణ్ ట్వీట్

ఏం చంపుతావా? విడదల రజినీని నెట్టేసి కిందపడేసిన SI

బంగారానికి ఏమైంది? వరుసగా పడిపోతున్న ధరలు!

జగన్ లాస్ట్ పంచ్... జస్ట్ సింగిల్ డిజిట్!

పోరాడిన ప్రతి అక్కచెల్లమ్మకు హ్యాట్స్ ఆఫ్.. జగన్ ఎమోషనల్

Photos

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం...నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)

+5

సంజూ, నమన్ మెరుపులు.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన భారత్ (ఫొటోలు)